ANCHOR ANASUYA IN THE CONTROVERSY ON REPUBLIC DAY NETIZENS TROLLING VIDEO GOES VIRAL SR
Anchor Anasuya : వివాదంలో యాంకర్ అనసూయ.. గాంధీ ఫోటో ఎందుకంటూ ట్రోలింగ్..
Anasuya Bharadwaj Photo : Twitter
Anchor Anasuya : రిపబ్లిక్ డే నాడు వివాదంలో చిక్కుకున్నారు తెలుగు పాపులర్ యాంకర్ అనసూయ. రిపబ్లిక్ రోజున ఆమె చేసిన ఓ పనికి నెటిజన్స్ ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
రిపబ్లిక్ డే నాడు వివాదంలో చిక్కుకున్నారు తెలుగు పాపులర్ యాంకర్ అనసూయ. రిపబ్లిక్ రోజున ఆమె చేసిన ఓ పనికి నెటిజన్స్ ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. యాంకర్ అనసూయ రిపబ్లిక్ డే విషెస్ చెబుతూ వందేమాతరం గీతాన్ని ఆలపించించారు. అంతేకాదు చాలా చక్కగా పాడారు. అదంతా బాగానే ఉన్నా వందేమాతరం గీతాన్ని అనసూయ కూర్చొని ఆలపించారు. దీనిపైనెటిజన్లు 'పాటను పాడేటప్పుడు ఎందుకు నిల్చో లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు టీ షర్ట్ పై గాందీ బొమ్మ ఎందుకు ధరించావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అదరగొట్టావు అనసూయ అంటూ పొగుడుతున్నారు.. అయితే ట్రోల్స్ తగ్గకపోవడంతో అనసూయ చివరికి సారీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అనసూయ యాంకరింగ్ విషయానికి వస్తే.. యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తుంటారు. అంతేకాదు తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ (Anchor Anasuya) ముందుంటారు.
అనసూయ నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకున్నారు. ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే అనసూయ వరుస సినిమాలతో అదరగొడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తున్న యాంకర్ అనసూయ మరో సినిమాకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అనసూయ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో ఓ సినిమాలో నటించనుందని సమాచారం. గతంలో 'పేపర్ బాయ్' సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయను లీడ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా అనసూయ కనిపించనున్నారు. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని (Anchor Anasuya) తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. ఈ సినిమాతో పాటు అనసూయ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.