ANCHOR ANASUYA GIVES A STRONG REPLY TO A NETIZEN ON SOCIAL MEDIA NR
anchor anasuya: ఈ సమయంలో ఇలాంటి బట్టలు అవసరమా అనసూయ?
Anchor anasuya Bharadwaj
anchor anasuya: బుల్లితెర యాంకర్ అనసూయ అంటే తెలియని వారెవ్వరు లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బుల్లితెర లోనే కాకుండా.. వెండితెర లో కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది.
anchor anasuya: బుల్లితెర యాంకర్ అనసూయ అంటే తెలియని వారెవ్వరు లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బుల్లితెర లోనే కాకుండా.. వెండితెర లో కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా అందరి సెలబ్రెటీల కంటే అనసూయనే ముందు ఉంటుందని చెప్పవచ్చు. అంత బిజీగా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటో షూట్ అంటూ అభిమానులకు తన అందాలతో ఏకంగా గ్లామర్ విందునే వడ్డిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సమయంలో ఈ ఫోటోలు అవసరమా అంటూ అనసూయ పై ట్రోలింగ్..
ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో ప్రతి ఒక్కరూ ఏం చేయలేని పరిస్థితిలో భయాందోళనకు గురవుతున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ వైరస్ గురించి జాగ్రత్తలు పడుతూ జాగ్రత్తలు తెలుపుతున్నారు. కానీ మన అనసూయ మాత్రం ఎటువంటి జాగ్రత్తలు లేకుండా హాయిగా ఫోటో షూట్ లు అంటూ కరోనా సమయాన్ని హ్యాపీగా గడిపేస్తుంది.
తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటో షేర్ చేయగా.. ఆ ఫోటో కాకుండా ఆమెకు ఎదురైన కామెంట్ వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ ఫోటో లో అనసూయ పొట్టి గౌను వేసుకుని చిన్నపిల్ల మాదిరిలా.. రెండు జడలు వేసుకుని ఫోటోకు పోజిచ్చింది. కానీ కోవిడ్ జాగ్రత్తలు మాత్రం అనసూయ లో కనిపించడం లేదు. కనీసం మాస్క్ ధరించకుండా ఉండేసరికి నెటిజనులు ట్రోలింగ్ చేయకుండా ఉంటారా..
Anchor anasuya Bharadwaj
ఇక ఓ నెటిజన్.. ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయడానికంటే ముందు దేశంలో కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా. దాని గురించి మీకు అసలు బాధ లేదా? నా ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈ ఫోటోలు అవసరమా? అని కామెంట్ చేశాడు. ఇక అనసూయ కామెంట్లకు స్పందించకుండా ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. ఇక వెంటనే ఆ నెటిజన్ పై.. ఇలాంటి కఠిన సమయాల్లో కూడా ఎంటర్టైన్ మెంట్, నమ్మకాన్ని కొంతవరకైనా మేము అందిస్తున్నాం. నువ్వు పాజిటివ్ కోణంలో ఆలోచించే లేవా.. అని కౌంటర్ వేసేసింది అనసూయ.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.