హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్ పాత్రలో అనసూయ.. రంగమ్మత్తకు భలే ఛాన్స్..

జబర్దస్త్ పాత్రలో అనసూయ.. రంగమ్మత్తకు భలే ఛాన్స్..

అనసూయ (Anasuya Bharadwaj)

అనసూయ (Anasuya Bharadwaj)

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్..తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్.

  Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్..తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా.. సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. ఆ సినిమాలో రంగమ్మత్తగా.. అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఇంకా చెప్పాలంటే రంగమ్మత్తగా అనసూయను తప్పా మరోకరిని ఊహించుకోలేము. అంతలా మెప్పించింది అనసూయ. అలా అటూ డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. రంగస్థలంలో అనసూయ చేసిన పాత్రతో ఇంప్రెస్ అయిన కృష్ణ వంశీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చిండట. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ అనే సినిమాలో అనసూయ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీ లో సూపర్ హిట్ అయిన నట సమ్రాట్ చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రూపొందిస్తున్నాడు.

  ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారు. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. అంతేకాదు ఈ సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నటించాల్సి ఉంటుందట. ఇది వరకు అనసూయకి స్పెషల్ సాంగ్స్ చేసిన అనుభవం ఉంది. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనాలో అనసూయ ఆడి పాడిన సంగతి తెలిసిందే. వీరితో పాటు బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పనులు కరోనా వల్ల లాక్ డౌన్ పూర్తైన తర్వాత పుంజుకోనున్నాయి.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Anasuya Bharadwaj, Jabardasth, Tollywood news

  ఉత్తమ కథలు