ANCHOR ANASUYA DARJA MOVIE TRAILER RELEASED BY VENKATESH DAGGUBATI SLB
Darja Trailer: యాంకర్ అనసూయకు వెంకటేష్ సపోర్ట్
Photo Twitter
Darja Trailer: అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా దర్జా. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో సునీల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని వెంకటేష్ రిలీజ్ చేశారు.
ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు వెండితెరపై హవా నడిపిస్తోంది యాంకర్ అనసూయ (Anchor Anasuya). పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశాలతో పాటు ఫిమేల్ లీడ్ సినిమాల్లో కూడా దర్శకనిర్మాతలకు బెటర్ చాయిస్ అవుతోంది అనసూయ. ఈ క్రమంలోనే అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా దర్జా (Darja). కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో సునీల్ (Sunil) మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. సలీమ్ మాలిక్ (Salim Malik) దర్శకత్వంలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్జాకు తన సపోర్ట్ అందించారు సీనియర్ హీరో వెంకటేష్ (Venkatesh Daggubati).
శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను (Darja Tariler) స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా బాగుందని, వీడియో చూస్తుంటే ఈ సినిమా చాలా రిచ్‌గా చిత్రీకరించారని అర్థమవుతోందని వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు వెంకీ. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ సినిమా ట్రైలర్ విడుదల చేసి, ఆశీస్సులు అందించిన ప్రముఖ హీరో వెంకటేష్ గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ధియేటర్ లలో దర్జా ట్రైలర్ ప్రదర్శించనున్నాం. ఈ నెలాఖరుకు‘దర్జా’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
ఈ మూవీలో ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రానికి రాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.