Home /News /movies /

ANCHOR ANASUYA BHARADWAJ TROLLED FOR DANCING WITH HER KIDS ON NEW YEAR PARTY HERE IS THE REASON SR

Anasuya Bharadwaj: నిక్కరులో పిల్లలతో కలిసి అనసూయ డ్యాన్స్..మండిపడుతున్న నెటిజన్స్

అనసూయ Photo : Instagram

అనసూయ Photo : Instagram

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంత పాపులర్ ఈ భామ.

  Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంత పాపులర్ ఈ భామ. టీవీ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ తగిన మోతాదుల్లో అందాలు ఆరబోస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిన అందాల హాట్ యాంకర్. బుల్లితెర గ్లామర్ క్వీన్‌గా అనసూయ తరచు వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌. తన షో అప్ డేట్స్‌తో పాటు తన పిల్లలతో, భర్తతో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా అనసూయ ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అనసూయ తన ఇద్దరు పిల్లలతో ప్రేమికుడు చిత్రంలోని ముక్కాల పాటకు అదరిపోయే స్టెప్పులతో కేకపెట్టించింది. ఓ హోటల్ ముందు పెద్ద పెద్ద స్పికర్స్ పెట్టి పాటలకు డాన్సులు వేస్తూ.. ఫ్యామిలీతో న్యూ ఇయర్‌ను జరుపుకుంది అనసూయ. ఈ సందర్భంగా అనసూయ తన పోస్ట్‌లో రాస్తూ.. న్యూ ఇయర్ సందర్భంగా ఇలా పిల్లలతో గడిపానని పేర్కోంది.

  అంతా బాగానే ఉన్న ఆ వీడియోలో అనసూయ కాస్తా పోట్టి డ్రెస్‌లో కనపడి కనుల విందు చేసింది. ఇది కొంతమంది నెటిజన్స్‌కు నచ్చలేదు. దీంతో కామెంట్స్ పెడుతున్నారు. ఎంటీ నువ్వు పిల్లలతో అలానే ఉంటావా.. కాస్తా పొడుగు డ్రెస్ వేసుకోవచ్చుగా అంటూ మండి పడుతున్నారు. మరికొంతమంది తన పిల్లలతో ఆమె ఎలా ఉంటే మీకెందుకు అంటూ కౌంటర్ ఇస్తూ అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొంత మంది అనసూయ నువ్వు బ్యూటీఫుల్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ఓ పక్క టీవీల్లో యాంకరింగ్ చేస్తూనే.. వీలున్నప్పుడల్లా.. సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. తాజాగా ఈ భామ మరో సినిమా చేస్తోంది. ‘థాంక్యూ బ్ర‌ద‌ర్’ ‌గా వస్తోన్న ఈ సినిమాలో అన‌సూయ గర్భిణిగా నటిస్తోంది. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ ను ఈ రోజు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విడుదల చేశాడు. లిఫ్టులో అనసూయ, మరో నటుడు అశ్విన్ ఇరుక్కుపోయి ప్రాణభయంతో ఉన్నట్లు ఈ లుక్ లో చూపించాడు దర్శకుడు. ఈ సినిమాను జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంలో మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.  ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పుష్పలో అనసూయ ఓ భిన్న పాత్రలో మరోసారి అలరించనుందట. ఈ సినిమాతో పాటు కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ.  అంతేకాదు ఈ సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నటించాల్సి ఉంటుందట. అనసూయ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రానుందట. ఆ విధంగా కృష్ణవంశీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక నటిస్తున్నారు.


  ఈ సినిమాతో పాటు అనసూయ చిరంజీవి ఆచార్యలో కూడా కనిపించనుందని తెలుస్తోంది. ఇక వీటితో పాటు అనసూయకు మరో ఆఫర్ వచ్చిందని టాక్. మాస్ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఖిలాడి పేరుతో వస్తోన్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు మరింత గ్లామర్‌ను తీసుకు వచ్చేందుకు గాను జబర్దస్త్ యాంకర్ అనసూయను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనసూయ కీలకపాత్రలో కనిపించనుందట.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Anchor anasuya, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు