అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో అనసూయ పాత్ర ఇదే.

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో అల్లు అర్జున్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.ఈ చిత్రంలో అనసూయ పాత్రపై క్లారిటీ ఇచ్చింది.

news18-telugu
Updated: January 19, 2020, 12:42 PM IST
అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో అనసూయ పాత్ర ఇదే.
అల్లు అర్జున్,సుకుమార్ సినిమాలో అనసూయ (Twitter/Photos)
  • Share this:
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో అల్లు అర్జున్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో జబర్దస్త్ షో యాంకర్ అనసూయ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల తర్వాత కథను కీలక మలుపు తిప్పే పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో అనసూయ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు ‘శేషాచలం’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ టైటిల్‌‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు.  'రంగస్థలం' లాంటి భారీ హిట్ తర్వాత కొత్త గ్యాప్ తీసుకున్న సుకుమార్.. ముందుగా మహేష్ బాబుతో చేద్దామనుకున్నాడు. ఎందుకో కథ సెట్ కాక.. అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు.

allu arjun rashmika mandanna sukumar movie wit starts with pooja ceremony with coconut broken event,allu arjun,aa19,aa20,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
అల్లు అర్జున్, సుకుమార్ మూవీ ప్రారంభం (Twitter/Photo)


ఇప్పటికే అనసూయ సుకుమార్, అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్  చేయడానికి తన డేట్స్ కూడా అడ్జస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు మరోసారి సుక్కు డైరెక్షన్‌లో తన టాలెంట్ చూపాలని ప్లానింగ్ మొదలు పెట్టింది అనసూయ.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు