‘అవేంజర్స్ ఎండ్ గేమ్’పై జబర్దస్త్ పంచ్.. అనసూయ సెన్సేషనల్ ట్వీట్..

ప్ర‌పంచమంతా ఇప్పుడు అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ మాయ కొన‌సాగుతుంది. ఈ చిత్రం కోసం పిచ్చోళ్లైపోతున్నారు అభిమానులు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎక్క‌డ చూసినా కూడా ఇప్పుడు ఇదే సినిమా ర‌చ్చ వినిపిస్తుంది.. క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 3, 2019, 7:42 PM IST
‘అవేంజర్స్ ఎండ్ గేమ్’పై జబర్దస్త్ పంచ్.. అనసూయ సెన్సేషనల్ ట్వీట్..
అనసూయ అవేంజర్స్ సినిమా
  • Share this:
ప్ర‌పంచమంతా ఇప్పుడు అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ మాయ కొన‌సాగుతుంది. ఈ చిత్రం కోసం పిచ్చోళ్లైపోతున్నారు అభిమానులు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎక్క‌డ చూసినా కూడా ఇప్పుడు ఇదే సినిమా ర‌చ్చ వినిపిస్తుంది.. క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అన‌సూయ కూడా అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ సినిమా చూసింది. విడుద‌లైన వారం రోజుల త‌ర్వాత ఈ చిత్రాన్ని చూసింది ఈ ముద్దుగుమ్మ‌. నేను లేట్ అయ్యాన‌ని తెలుసు.. కానీ చూసాను అంటూ ట్వీట్ చేసింది అను. అయితే ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ మాత్రం ఈ చిత్రంపై ఎవ‌రూ ఊహించ‌ని కామెంట్స్ చేసింది.

Anchor Anasuya hugely disappointed with Avengers Endgame and Jabardasth beauty tweeted about movie pk.. ప్ర‌పంచమంతా ఇప్పుడు అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ మాయ కొన‌సాగుతుంది. ఈ చిత్రం కోసం పిచ్చోళ్లైపోతున్నారు అభిమానులు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎక్క‌డ చూసినా కూడా ఇప్పుడు ఇదే సినిమా ర‌చ్చ వినిపిస్తుంది.. క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. anchor anasuya,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj twitter,anasuya bharadwaj avengers endgame movie,anchor anasuya bharadwaj,jabardasth comedy show,anchor anasuya family photos,jabardasth anchor anasuya,anchor anasuya dance,anchor anasuya husband bharadwaj,anchor anasuya hot,anchor anasuya husband photos,anasuya bharadwaj hot,anasuya bharadwaj kids,anchor anasuya marriage,anasuya bharadwaj house,telugu cinema,యాంకర్ అనసూయ,జబర్దస్త్ యాంకర్ అనసూయ,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా,అనసూయ ట్విట్టర్,తెలుగు సినిమా
యాంకర్ అనసూయ


అవేంజ‌ర్స్ సినిమాకు తాను పెద్ద ఫ్యాన్ అని ట్వీట్ చేసింది ఈ బ్యూటీ. కానీ ఎండ్ గేమ్ మాత్రం త‌న‌ను నిరాశ ప‌రిచిందంటూ ట్వీట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌స్తుతం రికార్డులు తిర‌గ‌రాస్తున్న ఈ చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ చేయ‌డం కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. కానీ త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను ధైర్యంగా బ‌య‌టికి చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఇందులో దాచుకోడానికి ఏమీ లేద‌ని చెబుతుంది అను.


కొన్ని అద్భుత‌మైన స‌న్నివేశాలు ఉన్నా కూడా మొత్తంగా మాత్రం అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ త‌న‌కు అస్స‌లు న‌చ్చ‌లేద‌ని.. డిస‌ప్పాయింట్ అయ్యాన‌ని చెప్పింది అన‌సూయ‌. ఈ ముద్దుగుమ్మ కామెంట్స్‌తో కొంద‌రు ఏకీభ‌విస్తున్నారు కూడా. క్రేజ్ ఉంది కాబ‌ట్టి క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి కానీ నిజంగానే ఈ చిత్రంలో అంత విష‌యం లేద‌నే వాళ్లు కూడా లేక‌పోలేరు. కాక‌పోతే వాళ్లు బ‌య‌టికి చెప్ప‌లేదు.. అన‌సూయ చెప్పింది అంతే తేడా. మిగిలందంతా సేమ్ టూ సేమ్.
First published: May 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు