Anchor Anasuya: అది చాలా మిస్ అవుతున్నా అంటూ ఏడ్చేసిన యాంకర్ అనసూయ.. ఏమిటంటే?

Anchor Anasuya

Anchor Anasuya: అనసూయ అంటే వెంటనే చాలు అందరూ ఇట్టాగే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తాను గుర్తింపు తెచ్చుకున్నది కేవలం ఒక్క బుల్లితెర లోనే కాదు. వెండితెరపై కూడా రంగమ్మత్త నుండి ఇటీవల విడుదలైన థాంక్యూ బ్రదర్ లో తన పాత్ర వరకు బాగా మెప్పించింది.

  • Share this:
    Anchor Anasuya: అనసూయ అంటే వెంటనే చాలు అందరూ ఇట్టాగే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తాను గుర్తింపు తెచ్చుకున్నది కేవలం ఒక్క బుల్లితెర లోనే కాదు. వెండితెరపై కూడా రంగమ్మత్త నుండి ఇటీవల విడుదలైన థాంక్యూ బ్రదర్ లో తన పాత్ర వరకు బాగా మెప్పించింది. అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో కూడా అనసూయ ఫైర్ బాంబ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనసూయ.. తనకు ఎదురయ్యే నెగటివ్ కామెంట్స్ తో తనదైన శైలిలో రెచ్చిపోతోంది.

    ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు కరోనా సెకండ్ వేవ్ తో నిండిపోయింది. అంతేకాకుండా రోజురోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక సినీ ఇండస్ట్రీలు కూడా మూతపడగా.. సెలబ్రిటీలు అంతా ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా అభిమానులతో తెగ ముచ్చటిస్తున్నారు. ఇక తాజాగా అనసూయ తన ఫేస్ బుక్ లో తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చటించగా.. అందులో తాను ఒకటి మిస్ అవుతున్న అంటూ ఏడ్చేసింది.

    ఫేస్ బుక్ లో ఒక ఆట ఆడిన అనసూయకు ఓ నెటిజన్ నుండి ఓ ప్రశ్న ఎదురయింది. ఆన్ లైన్ షాపింగ్ అంటే ఇష్టమా? లేదా ఇన్ పర్సన్ షాపింగ్ అంటే ఇష్టమా? అనే ప్రశ్న ఎదురవగా.. వెంటనే అనసూయ దానికి స్పందించింది. తనకు ఆన్ లైన్ షాపింగ్ అంటే నచ్చదని, తనకు ఎప్పుడూ కూడా ఇన్ పర్సన్ షాపింగ్ అంటేనే నచ్చుతుందని తెలిపింది. కానీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను అంటూ ఏకంగా ఏడుస్తూ చెప్పేసింది అనసూయ. ప్రస్తుతం తను ఏడుస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: