• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANCHOR ANASUYA BHARADWAJ JOINS THE MAMMOOTTY PROJECT BHEESHMA PARVAM HERE ARE THE DETAILS SR

Anasuya Bharadwaj: మమ్ముట్టి సినిమాలో అనసూయ.. మల్లువుడ్ ఎంట్రీ ఇస్తున్న జబర్దస్త్ భామ..

Anasuya Bharadwaj: మమ్ముట్టి సినిమాలో అనసూయ.. మల్లువుడ్ ఎంట్రీ ఇస్తున్న జబర్దస్త్ భామ..

Anasuya Photo : Twitter

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

  • Share this:
    Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్. అది అలా ఉంటే అనసూయకు తెలుగులో కాకుండా పరభాషాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం భీష్మ పర్వంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయ్యింది.

    ఈ సినిమా దర్శకుడు అమల్ నీరద్.. ఆ పాత్రకు అనసూయ అయితే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీంతో అనసూయ ఏప్రిల్‌లో షూటింగ్‌లో అడుగుపెట్టనుంది. ఇక గతంలో కూడా ఒకసారి అనసూయ మమ్ముట్టి యాత్రలో  సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల తమిళ సూపర స్టార్ విజయ్ సేతుపతి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన అనసూయ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోను అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇక అనసూయ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ జబర్దస్త్ భామ. ఇటీవల థ్యాంక్యూ బ్రదర్ అనే చిత్రంలో గర్భవతిగా నటించిన అనసూయ.. చావు కబురు చల్లగా చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం విడుదలచేసింది. అనసూయ ఈ పాటలో మాస్ స్టెప్స్‌తో ఇరగదీసిందనే చెప్పోచ్చు..

    ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కనిపించనుంది. మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ పుష్పలోను కనిపించనుంది. ఇక తాజాగా మారుతి, గోపీచంద్ పక్కా కమర్షియల్‌‌లో కూడా అనసూయ ఓ పాత్రలో మెరవనుంది. దీనికితోడు రవితేజ, రమేష్ వర్మ ఖిలాడి సినిమాలోను అనసూయ ఓ పాత్ర చేస్తుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు