Anasuya Bharadwaj House: బుల్లితెరలో, వెండితెర లో అనసూయ అనే పేరు.. తెలీనోలే లేరు.. బుల్లితెర యాంకర్ గ్లామర్ లో అనసూయను మించినోళ్ళు లేరు.. వయసు తో పాటు గ్లామర్ ను పెంచుకుంటూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. వెండితెర, బుల్లితెర లో సమానంగా బాధ్యతలను మోస్తూ తెగ బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈమె పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.
అనసూయ ఇద్దరు పిల్లల తల్లి.. కానీ వయసును మాత్రం గ్లామర్ తో దాచేస్తుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ లో యాంకరింగ్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైన ఈ హాట్ బ్యూటీ.. యాంకర్ల విషయంలో గ్లామర్ ను పరిచయం చేసింది. ఇక బుల్లితెరలో ఈమెకున్న క్రేజ్ తో వెండితెరపై అడుగు పెట్టింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తున్న అనసూయ.. అటు బుల్లితెర, ఇటు వెండితెర.. అప్పుడప్పుడు ఫోటో షూట్ లంటూ.. బాగా బిజీ గా మారింది. అంతేకాదండోయ్ తన కెరీర్ లో సోషల్ మీడియా కూడా ఒక భాగమే.
ఇక సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటుంది అనసూయ. ఇక తనకు నెగటివ్ కామెంట్స్ ఇస్తే చాలు.. ఇక కామెంటర్స్ అనసూయ మాటలకు బలి అవ్వాల్సిందే. మొత్తానికి అనసూయ సోషల్ మీడియాలో అగ్గిపుల్ల అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియోలో తన ఇల్లు కనిపించగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. తను ఓ ప్రోగ్రామ్ కు వెళ్తున్న దృశ్యం లో.. తనను పికప్ చేసుకోవడానికి తన ఇంటికి వచ్చిన ఓ డిజిటల్ క్రియేటర్ అనసూయను వీడియో తీస్తున్న సందర్భంలో అనసూయ ఇల్లు కనబడింది. ఇక వాళ్లతో కలిసి కారులో వెళుతున్న సమయంలో కూడా వాళ్ళ కౌంటర్ లకు సైలెంట్ అయిపోయింది.
View this post on Instagram
ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా.. ఇటీవలే తను నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అంతే కాకుండా తను ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాల్లో కూడా నెగటివ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మొత్తానికి అనసూయ ఓ రేంజ్ లో బిజీబిజీ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha app, Anasuya Bharadwaj House, Kaskoo nikhil, Ott realease, Thank you brother film, Viral Video, యాంకర్ అనసూయ