యాంకర్ అనసూయను ఫిదా చేసిన యువ హీరో...ఇద్దరూ కలిసి...

యాంకర్ అనసూయతో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిన కుర్రహీరో ఆమెను తెగ పొగిడేశాడు. అనసూయతో డ్యాన్స్ చేసేందుకే ఈ ప్రోగ్రాంకు వచ్చానని బిస్కెట్ వేశాడు. అంతేకాదు అనసూయ డ్యాన్స్ చేస్తే ఆ డ్యాన్సుకే అందం వస్తుందని మరికాస్త సోప్ అద్దాడు.

news18-telugu
Updated: December 14, 2019, 9:27 AM IST
యాంకర్ అనసూయను ఫిదా చేసిన యువ హీరో...ఇద్దరూ కలిసి...
అనసూయ భరద్వాజ్ (File)
  • Share this:
యాంకర్ అనసూయ కొత్త ప్రోగ్రాం లోకల్ గాంగ్స్ కోసం తెగ కష్టపడుతోంది. ప్రోగ్రామ్ ను హిట్ చేసేందు కోసం శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే షో కోసం గ్లామర్ డోస్ మరికాస్త పెంచిన అనసూయ అటు డాన్సులతో మరింత మెస్మరైజ్ చేస్తోంది. అయితే శనివారం ప్రసారం కానున్న కొత్త ఎపిసోడ్ కోసం అనసూయ ఓ యంగ్ హీరోతో కలిసి డ్యాన్స్ చేసింది. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. 90ఎంఎల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తీకేయ లోకల్ గ్యాంగ్స్ కోసం ప్రత్యేక అతిథిగా వచ్చాడు. అయితే యాంకర్ అనసూయతో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిన కుర్రహీరో ఆమెను తెగ పొగిడేశాడు. అనసూయతో డ్యాన్స్ చేసేందుకే ఈ ప్రోగ్రాంకు వచ్చానని బిస్కెట్ వేశాడు. అంతేకాదు అనసూయ డ్యాన్స్ చేస్తే ఆ డ్యాన్సుకే అందం వస్తుందని మరికాస్త సోప్ అద్దాడు. దీంతో కరిగిపోయిన అనసూయ కుర్రహీరోతో కలిసి స్టెప్పులు వేసింది. మరి ఇంత కష్టపడుతున్న అనసూయ ఈ ప్రోగ్రాంను రేటింగుల పరంగా ఎలా గట్టెక్కిస్తుందో వేచిచూడాల్సిందే.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>