హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya Bharadwaj: ఛీ.. మూడ్ అంతా చెడ‌గొడుతుంటారు.. లైవ్‌లో అస‌హ‌నానికి గురైన అన‌సూయ‌

Anasuya Bharadwaj: ఛీ.. మూడ్ అంతా చెడ‌గొడుతుంటారు.. లైవ్‌లో అస‌హ‌నానికి గురైన అన‌సూయ‌

అనసూయ భరద్వాజ్ Photo : Instagram

అనసూయ భరద్వాజ్ Photo : Instagram

తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్స‌న అవ‌స‌రం లేదు. తెలుగులో ప్ర‌ముఖ‌ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ‌.. మరోవైపు సినిమాల్లోనూ న‌టిస్తోంది.

  Anasuya Bharadwaj:  తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్స‌న అవ‌స‌రం లేదు. తెలుగులో ప్ర‌ముఖ‌ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ‌.. మరోవైపు సినిమాల్లోనూ న‌టిస్తోంది. ముఖ్యంగా త‌న‌కు గుర్తింపు ల‌భించే పాత్ర‌ల‌నే ఎంచుకుంటూ వ‌స్తోన్న అన‌సూయ‌.. ఎన్నో హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు ప్రేక్ష‌కులు ఎవ్వ‌రూ అంత ఈజీగా మ‌ర్చిపోరు. ఇక ఇప్పుడు కూడా ప‌లు చిత్రాల్లో అన‌సూయ న‌టిస్తోంది. వాటిలో థ్యాంక్యు బ్ర‌ద‌ర్ అనే చిత్రం ఒక‌టి. ఇందులో అన‌సూయ గ‌ర్భిణి పాత్ర‌లో న‌టించ‌గా.. షూటింగ్ పూర్తి చేసుకొని విడుద‌ల‌కు కూడా సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోగా.. సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

  కాగా ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇటీవ‌ల ఇన్‌స్టాలో లైవ్ ఇచ్చింది అన‌సూయ‌. అందులో అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌తో పాటు సినిమా ముచ్చ‌ట్ల‌ను పంచుకున్నారు అన‌సూయ‌. ఈ సినిమా క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని, త‌న ప్రియ పాత్ర అంద‌రికీ గుర్తుండిపోతుంద‌ని ఆమె తెలిపారు. ఇక ఈ మూవీలో మేకప్ లేకుండా న‌టించాన‌ని ఆమె తెలిపారు.


  ఇదిలా ఉంటే అన‌సూయ లైవ్‌లో ఉన్న స‌మ‌యంలో కామెంట్లు చ‌దువుతుండ‌గా.. ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టిన‌ట్లుగా ఉంది. ఇక ఆ కామెంట్‌ని చ‌దివిన అన‌సూయ అస‌హ‌నానికి గుర‌య్యారు. ఛీ.. మంచి మూడ్ అంతా చెడ‌గొడుతుంటారు. ఇంత హ్యాపీగా ఉన్న స‌మ‌యంలో అంటూ బాగా ఫీల్ అయ్యింది. అయితే ఈ మూవీపై అన‌సూయ మంచి అంచ‌నాల‌ను పెట్టుకున్నారు. ఈ మూవీని మొద‌ట ఓటీటీ కోసం అనుకున్నామ‌ని.. కానీ ఇప్పుడు థియేట‌ర్లలో మూవీలు రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో.. థ్యాంక్యు బ్ర‌ద‌ర్‌పై టీమ్ ఆలోచిస్తుంద‌ని అన‌సూయ వివ‌రించారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Anasuya Bharadwaj, Anchor anasuya

  ఉత్తమ కథలు