నాగబాబు జబర్దస్త్ అందుకే వదిలేసాడంటున్న అనసూయ భరద్వాజ్..

అనసూయ, నాగబాబు (anasuya bharadwaj nagababu)

Anasuya Bharadwaj: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి ఉన్నంత క్రేజ్ మరే కామెడీ షోకు కూడా లేదు. దీనికి పోటీగా కొన్ని పెట్టినా కూడా అవి నిలబడలేదు. వెంటనే తీసేసారు కూడా.

  • Share this:
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి ఉన్నంత క్రేజ్ మరే కామెడీ షోకు కూడా లేదు. దీనికి పోటీగా కొన్ని పెట్టినా కూడా అవి నిలబడలేదు. వెంటనే తీసేసారు కూడా. ఇది మాత్రం ఎవరున్నా లేకపోయినా ఏడేళ్లుగా నడుస్తూనే ఉంది. నాగబాబు లాంటి వాళ్లు వెళ్లిపోయినా కూడా జబర్దస్త్ కామెడీ షోకు ఎలాంటి ఢోకా లేదు. పైగా ఈ షో నుంచి ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్లు మంచి స్థాయిలో ఉన్నారు కూడా. కొందరు జబర్దస్త్ వదిలేసి బయటికి వెళ్లిపోయి సినిమాలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇందులో యాంకర్స్‌గా ఉన్న అనసూయ, రష్మి గౌతమ్ కూడా ఈ షో నుంచే పాపులర్ అయ్యారు.
అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)
అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)

అంతకు ముందు వాళ్లు కొన్ని షోలు చేసినా కూడా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ తర్వాతే స్టార్స్ అయ్యారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ షోకు అంత హైప్ రావడంలో తన పాత్ర కూడా ఉందని చెప్తుంది అనసూయ భరద్వాజ్. తాము ఉండటం వల్ల కూడా జబర్దస్త్‌కు క్రేజ్ వచ్చిందని.. గ్లామర్ కలిసిందని అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే నాగబాబు వెళ్లిపోవడంపై కూడా కొన్ని కామెంట్స్ చేసింది అనసూయ. జబర్దస్త్ కామెడీ షో ఎవరున్నా లేకపోయినా కూడా నడుస్తుందని.. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదని చెప్పింది.
అనసూయ భరద్వాజ్ ఫైల్ ఫోటో (anasuya bharadwaj)
అనసూయ భరద్వాజ్ ఫైల్ ఫోటో (anasuya bharadwaj)

వెళ్లిపోయే వాళ్లను వద్దని చెప్పదు.. అక్కడున్న వాళ్లను వెళ్లిపొమ్మని మల్లెమాల ఎప్పటికీ చెప్పదని చెప్పింది అనసూయ భరద్వాజ్. మాకు మేం వదిలేసి వెళ్తే తప్ప జబర్దస్త్ నుంచి ఎవరూ బయటికి వెళ్లరని.. అలాగే నాగబాబు కూడా తన సొంత నిర్ణయం తీసుకున్నాడని చెప్పింది అనసూయ. అందులో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని.. అంత మాత్రానా ఆయన జబర్దస్త్‌ను ఏదో పగతో వదిలేసి వెళ్లిపోయాడు అనుకోవడం తప్పని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. తన గురించి చెప్తూ చాలా రోజుల తర్వాత మళ్లీ షూట్‌కు వచ్చానని చెప్పింది ఈ భామ. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ సినిమాల కారణంగా వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఈ జబర్దస్త్ బ్యూటీ.
Published by:Praveen Kumar Vadla
First published: