Home /News /movies /

ANASUYA MAKES SENSATIONAL COMMENTS ON FAVORITISM IN TOLLYWOOD MHN

Anasuya Bharadwaj: టాలీవుడ్ ఫేవ‌రెటిజంపై అన‌సూయ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

Anasuya makes sensational comments on favoritism in Tollywood

Anasuya makes sensational comments on favoritism in Tollywood

Anasuya Bharadwaj - Anchor: అనసూయ భరద్వాజ్ టాలీవుడ్‌లో జరిగే ఫెవరిటిజం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

    నెపోటిజం.. అంటే బంధుప్రీతి. దీని గురించి అంద‌రికీ తెలిసిందే. సినీ ప‌రిశ్ర‌మ‌లో బంధుప్రీతి గురించి ఎప్పుడూ డిస్క‌ష‌న్ జ‌రుగుతూ ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ఒకానొక ద‌శ‌లో నెపోటిజంపై భారీ చర్చే జ‌రిగింది. కానీ ఎప్పుడు ఫేవ‌రెటిజంపై చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ఫేవ‌రెటిజం.. అంటే త‌న‌కు న‌చ్చిన వారికి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం. ఫెవ‌రెటిజం అనేది లోలోప‌ల ఇది అన్నీ రంగాల్లో జ‌రిగే విష‌య‌మే. దీని గురించి తొలిసారి టాలీవుడ్ న‌టి, ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ నోరు విప్పింది. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో అన‌సూయ ఫెవ‌రెటిజం గురించి మాట్లాడుతూ....

    ‘ఎందుకో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తెలియ‌ని ఫెవ‌రెటిజం ఉంటుంది. అందుకు కార‌ణంగా షూటింగ్ ప్యాక‌ప్ చెప్పేసిన త‌ర్వాత చేసే నెట్‌వ‌ర్కింగ్ కార‌ణ‌మ‌ని చెప్పాలి. దాని ప్ర‌భావంతోనే ఫెవ‌రెటిజం ప్ర‌భావం చూపుతుంది. దీని కార‌ణంగా చాలా సంద‌ర్భాల్లో అవ‌కాశాలు మ‌న చేతికి వ‌చ్చిన‌ట్లే చేజారిపోతుంటాయి. నేను కూడా ఫెవ‌రెటిజం కార‌ణంగా అకాశాల‌ను పోగొట్టుకున్నాను. నాలుగు పెద్ద సినిమాలకు సంబంధించి ఆడిష‌న్స్ ఇచ్చాను. డైరెక్ట‌ర్స్ చాలా మెచ్చుకున్నారు. అయితే కొన్నిరోజుల త‌ర్వాత ఆ పాత్ర‌ల‌ను మ‌రొక‌రికి ఇచ్చార‌ని తెలిసింది. అయితే ఆ పాత్ర‌ల‌ను చేసిన వారు నాకంటే గొప్ప‌గా చేసేవారైతే కాదు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక‌ప్పుడు ఎక్కువ‌గా బాధ‌ప‌డేదాన్ని కానీ.. ఇప్పుడు పెద్ద‌గా బాధ‌ప‌డ‌టం లేదు’ అని ఫెవరెటిం గురించి, తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

    బుల్లితెరపై హాట్ యాంకర్‌గా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ‌.. క్ష‌ణం సినిమాతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లం న‌టిగా మ‌రింత పేరు తెచ్చింది. అయితే సినిమాల‌ను ఎంపిక చేసుకోవ‌డంలోప‌ర్టికుల‌ర్‌గా ఉంటోంది.
    Published by:Anil
    First published:

    Tags: Anasuya Bharadwaj, Anchor anasuya, Tollywood

    తదుపరి వార్తలు