అందానికే అసూయ కలిగేలా చేస్తోన్న అనసూయ సొగసు..

Anasuya Bharadwaj : ‘మీకు మాత్రమే చెప్తా’లో కీలక పాత్ర చేస్తున్న అనసూయ.. ట్రైలర్ లాంచ్‌లో అదిరిపోయే డ్రెస్‌లో అదరగొట్టింది. అందరి చూపు ఈ భామ వైపే అంటే అతిశయోక్తికాదు. అంతలా అదరగొడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

news18-telugu
Updated: October 19, 2019, 7:18 AM IST
అందానికే అసూయ కలిగేలా చేస్తోన్న అనసూయ సొగసు..
Instagram
  • Share this:
Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అందులో భాగంగా ఈ భామ విజయ్ దేవరకొండ నిర్మాతగా, తరుణ్ భాస్కర్ హీరోగా వస్తోన్న‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించింది. దానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవలే  సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో మహేష్ బాబుతో పాటు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, అనసూయ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్‌లో అనసూయ.. అదిరిపోయే డ్రెస్‌లో అదరగొట్టింది. అందరి చూపు ఈ భామ వైపే అంటే అతిశయోక్తికాదు. అంతలా అదరగొడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 View this post on Instagram
 

How I looked at the #MMC Trailer launch!!🥰 PC: @valmikiramu 😊 #MeekuMaathrameChepta 🤫


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

కాగా ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోస్‌ను అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో హాట్‌గా అదరగొడుతున్న ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ సూపర్.. అంటూ  కొందరూ.. అదిరిపోయే అందం అంటూ మరికొందరూ కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాగా ఈ భామ నటించిన మీకు మాత్రమే చెప్తా..లో అనసూయతో పాటు ముఖ్య పాత్రల్లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ తదితరులు నటించారు. విజయ్ దేవరకొండ నిర్మిస్తున్నారు.  షమీర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


First published: October 19, 2019, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading