హైపర్ ఆది కామెంట్స్‌కు అనసూయ సీరియస్...అందరూ చూస్తుండగానే...

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)

లేడీస్ పై హైపర్ ఆది తన పంచులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే అనసూయను ఎప్పటి లాగే తన కామెంట్స్ తో కితకితలు పెట్టే హైపర్ ఆది, ఈ సారి మాత్రం కాస్త డోస్ పెంచి వ్యాఖ్యలు చేయడంతో అనసూయ కాస్త సీరియస్ అయినట్లు వినిపిస్తోంది.

  • Share this:
    తాను అనసూయ మనసు గెలుచుకోవడానికి వచ్చాను అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మల్లెమాల వారి ప్రతిరోజూ పండగే కార్యక్రమం ఓపెనింగ్ ఎపిసోడ్ లో హైపర్ ఆది స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. అయితే అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో పూర్తిగా లేడీస్ ఓరియంటెడ్ గా నడవనుంది. అయితే ఈ షోలో హైపర్ ఆదికి పెద్దగా పనిలేదు. అయినప్పటికీ కల్పించుకొని వచ్చి, అందులోని లేడీస్ పై హైపర్ ఆది తన పంచులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే అనసూయను ఎప్పటి లాగే తన కామెంట్స్ తో కితకితలు పెట్టే హైపర్ ఆది, ఈ సారి మాత్రం కాస్త డోస్ పెంచి వ్యాఖ్యలు చేయడంతో అనసూయ కాస్త సీరియస్ అయినట్లు వినిపిస్తోంది. అయితే షో తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఎప్పటి లాగే హైపర్ ఆది, అనసూయ మాత్రం ఫ్రెండ్లీగానే మూవ్ అవ్వడం ద్వారా వారి ప్రొఫెషనలిజాన్ని నిలుపుకున్నారనే చెప్పవచ్చు.
    Published by:Krishna Adithya
    First published: