ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌పై అలిగిన అనసూయ... అలా ఎలా పిలుస్తారు..

Anasuya Bharadwaj : సినీ ఇండస్ట్రీ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిలింఫేర్ (65వ) అవార్డుల ప్రదానోత్సవం తాజాగా అసోంలోని గువాహటిలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..

news18-telugu
Updated: February 17, 2020, 10:50 AM IST
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌పై అలిగిన అనసూయ... అలా ఎలా పిలుస్తారు..
అనసూయ Photo ; Twitter
  • Share this:
Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. తెలుగు టీవీ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్. అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే వీలున్నప్పడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా అనసూయ 'క్షణం' సినిమాలో మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాలో రంగమ్మత్తగా అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. అది అలా ఉంటే తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌పై రంగమ్మత్త అలిగింది.  సినీ ఇండస్ట్రీ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిలింఫేర్ (65వ) అవార్డుల ప్రదానోత్సవం ఈసారి అసోంలోని గువాహటిలో ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ఫిలింఫేర్ అవార్డుల్లో 'గల్లీబోయ్' ఉత్తమ చిత్రంగా నిలవగా, ఉత్తమనటుడి అవార్డును రణ్‌వీర్ సింగ్ గెల్చుకున్నాడు. ఉత్తమనటిగా అలియా భట్ అవార్డు దక్కించుకుంది. ఉత్తమ దర్శకురాలుగా జోయా అక్తర్ (గల్లీబోయ్) అవార్డ్‌ను గెలుచుకుంది. దీనికి తోడు గల్లీబోయ్ బెస్ట్ మ్యూజిక్ ఆల్బం, ఉత్తమ సాహిత్యం, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ ఇలా పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. ఈ చిత్రంలో నటించిన సిద్ధాంత్ చతుర్వేది, అమృతా సుభాష్ వరుసగా ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి అవార్డులు కైవసం చేసుకున్నారు.

అనసూయ Photo ; Twitter


అయితే ఈ అవార్డ్స్ ‌ను ఏకపక్షంగా ఇచ్చారని కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ ట్విటర్‌ వేదికగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం‌పై ధ్వజమెత్తింది. ఆలియా భట్‌, అనన్య పాండే కంటే బాగా నటించే చాలా మంది నటీమణులు ఇండస్ట్రీలో ఉన్నారని రంగోలీ పేర్కోంది. ‘గల్లీబోయ్‌’ సినిమాలో అలియా భట్‌ నటన యావరేజ్‌గా ఉంటుందని.. మరి అలాంటి నటికి ఫిలింఫేర్‌ అవార్డు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. ఉత్తమ సహాయ నటిగా అనన్యపాండే కంటే ‘పటాఖా’ సినిమాలో నటించిన రాధిక మదన్‌కు ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని అభిప్రాయపడింది. ఇదే విషయంపై యాంకర్ అనసూయ కూడా మండిపడింది. గల్లీబోయ్ పాటకు బెస్ట్ లిరిక్స్ అవార్డ్ ఇవ్వగా.. ఇదేం చాయిస్‌ అని.. అక్షయ్ కుమార్ నటించిన కేసరి సినిమాలో తేరె మిట్టికి ఇవ్వకుండా అలా ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. అంతేకాదు ఫిల్మ్ ఫేర్ నిర్వాహాకులకు కేవలం విన్నర్స్ మాత్రమే చాలనీ, నామినేట్ చేసిన వారిని ఎందుకు అవార్డ్ ఫంక్షన్స్‌కు పిలవరని వాపోయింది.First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు