ANASUYA BHARADWAJ TO DO A DIFFERENT ROLE FOR SUKUMAR PUSHPA SR
Anasuya Bharadwaj : అనసూయకు జబర్దస్త్ పాత్ర ఇచ్చిన సుకుమార్.. రంగమ్మత్తను మించి..
అనసూయ Photo : Instagram
Anasuya Bharadwaj : సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా.. అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది.
Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల హాట్ యాంకర్. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా.. సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా.. అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఇక అది అలా ఉంటే తాజాగా ఆమె గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. యాంకర్ అనసూయ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆమె దృష్టి లోపం ఉన్న మహిళగా నటిస్తోందని ఆ వార్తల సారాంశం. ఈ సినిమాలో అనసూయ ఒక ప్రమాదంలో కళ్ళు కోల్పోతుందట. ఆ పాత్ర చాలా కీలకం అని వార్తలు వస్తున్నాయి. దీంతో అనసూయ ప్రస్తుతం దృష్టి లోపం ఉన్న మహిళగా నటించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ.. చేయాల్సిన హోమ్ వర్క్ చేసే పనిలో ఉందట.
రంగస్థలంలో ఈ భామ చేసిన నటనకు ఫిదా అయిన కృష్ణ వంశీ.. తన రంగ మార్తండలో ఛాన్స్ ఇచ్చాడట. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ.
అనసూయ (Anasuya Bharadwaj/Youtube)
అంతేకాదు ఈ సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నటించాల్సి ఉంటుందట. ఇది వరకు అనసూయకి స్పెషల్ సాంగ్స్ చేసిన అనుభవం ఉంది. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనాలో అనసూయ ఆడి పాడిన సంగతి తెలిసిందే. వీరితో పాటు బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.