Anasuya Bharadwaj: ఆమెలా నేనెందుకు ఉండాలి.. నా డ్రెస్ నా ఇష్టం: అనసూయ

తన వస్త్రధారణ, వ్యవహార శైలితో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది హాట్ యాంకర్ అనసూయ. తాజాగా తన డ్రెసింగ్ పై కామెంట్స్ చేసిన ఒక నెటిజన్‌కు అనసూయ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 14, 2019, 11:21 AM IST
Anasuya Bharadwaj: ఆమెలా నేనెందుకు ఉండాలి.. నా డ్రెస్ నా ఇష్టం:  అనసూయ
అనసూయ భరద్వాజ్
  • Share this:
తన వస్త్రధారణ, వ్యవహార శైలితో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది హాట్ యాంకర్ అనసూయ. ఈ మధ్య హాట్ హాట్ ఫొటోలతో కాకరేపుతోంది అనసూయ. టీవీ తెరపై పొట్టి బట్టలేసి నెటిజన్లతో దారుణమైన ట్రోలింగ్స్ గురి అవుతున్న అనసూయ వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు తనను ట్రోలింగ్ చేసిన వాళ్లకు సమయం చూసి గట్టి కౌంటరే ఇస్తోంది. తాను ఈ ట్రోలింగ్స్‌ని పట్టించుకోనని.. వాటిని పట్టించుకుని బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. అందుకే ఇపుడు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు.  ఒకప్పుడు ఈ కామెంట్స్ గురించి ఆలోచించి బాధపడ్డా.. కానీ.. ఇప్పుడు అస్సలు పట్టించుకోను.. ఎందుకంటే.. నాబట్టలు నా ఇష్టం.. నన్ను అలా ఉండు.. ఇలా ఉండని.. జడ్జ్ చేయడానికి మీకు హక్కు లేదని’ కుండ బద్దలు కొట్టినట్టు తనను విమర్శిస్తున్న నెటిజెన్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. యాంకర్ సుమ, ఝాన్సీ గార్లంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల అనుభవం ముందు నేను ఎంత చేసినా.. తక్కువేనని.. నేను ఎంత ఎదిగినా తక్కువగానే ఉంటానని అన్నారు. ఇక నా యంకరింగ్ విషయానికి కొస్తే.. మేమేందరం ఒకే ఫ్రొఫెషన్‌కి చెందినవాళ్లం.. వాళ్ల కంఫర్ట్ జోన్‌‌లో వాళ్లున్నారు. నా కంఫర్ట్‌ జోన్‌లో నేను ఉన్నానని తెలిపింది. నాకు లేని బాధ మీకెందుకు..? వాళ్ల లాగ ఉండొచ్చుగా.. వీళ్లలాగా ఉండొచ్చుగా అనే చెత్త ఐడియాలకు నాకు ఇవ్వకండి. ఐనా  సుమ లాగ నేనెందుకు ఉండాలి. సుమనే నాలాగ ఉండొచ్చుగా.. నేను ప్రెజెంట్ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నా.. అంటూ.. ఘాటుగా స్పందించింది యాంకర్ అనసూయ.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు