Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Anasuya: అనసూయపై మళ్లీ ట్రోలింగ్.. గోవా ఎక్కడుందో కూడా తెలియదా?

    అందమైన అమ్మాయిలకు బ్రెయిన్ ఉండదని మరోసారి నిరూపితమయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీ పిల్లల బుక్స్ చుదువుకో.. అప్పుడైనా తెలిస్తుందని మరో వ్యక్తి విమర్శించాడు.

    news18-telugu
    Updated: October 4, 2020, 8:37 PM IST
    Anasuya: అనసూయపై మళ్లీ ట్రోలింగ్.. గోవా ఎక్కడుందో కూడా తెలియదా?
    అనసూయ
    • Share this:
    జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్‌ను నెటిజన్లు మళ్లీ టార్గెట్ చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆమె డ్రెస్సింగ్‌పై విమర్శలు చేసిన ఆకతాయిలు.. ఇప్పుడు గోవాలో దిగిన ఓ ఫొటోపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఐతే ఆమె డ్రెస్ గురించి కాదు. ఆ లొకేషన్ గురించి రచ్చ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే... అనసూయ తన భర్తతో కలసి గోవా టూర్‌కు వెళ్లింది. అక్కడ వారు గడిపిన మధుర క్షణాల్లో కొన్నింటిని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. గోవాలోని హిందూ సముద్రం వద్ద తాను ఉన్నట్లు ఓ ఫొటోను షేర్ చేసింది అనసూయ. నిర్మలమైన సముద్రం, బీచ్ అందాలను చూస్తూ ఆ ఫొటోలో కనిపించింది.
    ఐతే గోవాలో ఉన్నది అరేబియా సముద్రమని.. హిందూ సముద్రం కాదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నీకు ఆమాత్రం తెలియాదా అని ట్రోలింగ్ చేస్తున్నారు. అందమైన అమ్మాయిలకు బ్రెయిన్ ఉండదని మరోసారి నిరూపితమయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీ పిల్లల బుక్స్ చుదువుకో.. అప్పుడైనా తెలిస్తుందని మరో వ్యక్తి విమర్శించాడు.


    నెటిజన్ల కామెంట్స్‌పై చిర్రెత్తుకొచ్చిన అనసూయ.. ఒకే ఒక్క కామెంట్‌తో వారందరి నోర్లు మూయించే ప్రయత్నం చేసింది. అరేబియా సముద్రం ఉత్తర హిందూ సముద్రంలోని ఒక ప్రాంతమంటూ.. వికీపీడియా స్క్రీన్ షాట్‌ను పోప్ట్ చేసింది. అందరి విమర్శలకు సమాధానం చెప్పలేను.. మీ కోసం ఈ స్క్రీన్ షాట్‌ను అటాచ్ చేస్తున్నానని తెలిపింది.

    మరికొందరు మాత్రం అనసూయను వెనకేసుకొచ్చారు. ప్రతి ఇడియట్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమెకు సూచించారు. సోషల్ మీడియాలో పనిలేని వారు చాలా మంది ఉన్నారని.. అలాంటి వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనసూయకు మద్దతు తెలిపారు.
    Published by: Shiva Kumar Addula
    First published: October 4, 2020, 8:37 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading