యాంకర్ సుమపై అనసూయ సంచలన వ్యాఖ్యలు

నా డ్రెస్ నా ఇష్టం.. యాంకర్ సుమలా నేను కాదు అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: October 1, 2019, 8:46 AM IST
యాంకర్ సుమపై అనసూయ సంచలన వ్యాఖ్యలు
యాంకర్ సుమ, అనసూయ భరద్వాజ్
  • Share this:
బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్ పై తళుక్కుముంటున్న బ్యూటీ అనసూయ. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఈ భామ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా రంగమ్మత్త యూఎస్‌లో సందడి చేసింది. అక్కడి చల్లటి మంచు గాలిలో పొట్టి పొట్టి డ్రస్సుల్లో సందడి చేసింది. చిన్న నిక్కర్ వేసుకొని పొట్టి టాప్‌తో ఫోటోలు దిగింది. ఇక ఆ ఫోటోల్ని ఏ మాత్రం లేట్ చేయకుండా తన సోషల్ మీడియాలో పేజీలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హాట్ ఫోటోల్ని పెట్టేసింది. అమెరికాలో అనసూయ డ్రెస్సింగ్ చూసి అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు.

అమెరికాలో అనసూయ హాట్ ఫోటోస్


ఎప్పటికప్పుడు తన షూటింగ్ అప్డేట్స్‌, జబర్దస్త్ మేకోవర్ ఫొటోలతో పాటు పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కి టచ్‌లో ఉండే అనసూయ అందాల కనువిందుపై పొగడ్తల వర్షంతో పాటు కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. విదేశాల్లో వెళ్లి కూడా ఏంటీ డ్రెస్సింగ్ అంటూ కొందరు అనసూయను ఆడేసుకుంటున్నారు. అయితే వీటిని అనసూయ ఏమాత్రం లెక్కచేయడం లేదు.

అమెరికాలో అనసూయ హాట్ ఫోటోస్
‘అన్నీ విప్పుకుని నగ్నంగా నిలబడ్డా ఆ దృష్టితో చూడకూడదు.. నా డ్రెస్ నా ఇష్టం.. యాంకర్ సుమలా నేను కాదు.. నాలా సుమ ఉండొచ్చుగా.. వస్త్రధారణపై అలా ఉండాలి ఇలా ఉండాలి అని జడ్జ్ చేసే హక్కు మీకెక్కడిది ..ఛల్’ అంటూ తన హాట్ నెస్‌ని ప్రశ్నించే వారికి ఘాటుగానే సమాధానం ఇస్తుంటుంది అనసూయ.దీంతో ఇప్పుడు అనసూయ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది. యాంకర్ సుమ డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేయడంతో సుమ అభిమానులు అనసూయపై మండిపడుతున్నారు.
First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు