‘సైరా నరసింహారెడ్డి’ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న చిరంజీవి.. అదే ఊపులో విజయ దశమి రోజున కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఈ సెట్స్ పై వెళ్లనుంది. ఈ సినిమాను కొరటాల శివ తనదైన శైలిలో మెసెజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచరాం. ఈ సినిమాలో చిరంజీవి ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమచారం. మరోవైపు నక్సలైట్ క్యారెక్టర్ కూడా చేయబోతున్నట్టు చెబుతున్నారు. ఆ పాత్రలో చిరంజీవి నెరిసిన జుట్టుతో కనిపించనున్నట్టు సమాచారం.

చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)
మరోవైపు ఈ సినిమాలో జబర్ధస్త్ అనసూయ ఒక పవర్ఫుల్ పాత్ర చేయబోతున్నట్టు గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేసాయి. ఇక చిరంజీవి కూడా అనసూయతో ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చేయించాలనుకున్నట్టు సమాచారం. తీరా చూస్తే.. ఈ సినిమాలో అనసూయ పాత్రకు అంత స్కోప్ లేదని చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలో అనసూయ నటించడమనేది డౌటే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మొత్తానికి చిరంజీవి, కొరటాల శివ సినిమాలో అనసూయ పాత్రపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 11, 2019, 09:33 IST