news18-telugu
Updated: August 18, 2020, 9:05 PM IST
పవన్ కళ్యాణ్,అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)
Anasuya Bharadwaj: తెలుగు టీవీ ప్రేక్షకులకు అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ భామ. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. మరీ ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ అనసూయ పాల్గొనే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో అనసూయ భరద్వాజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అప్పట్లో అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించిన వివాదంపై స్పందించింది.
‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పార్టీ పాట కోసం తనను సంప్రదించారు. కానీ అప్పటికీ నేను రెండోసారి ఆరు నెలలు గర్భవతిని. దీంతో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో యాక్ట్ చేయలేకపోయాను. ఆ తర్వాత ఆ సినిమా రిలీజైంది. అప్పుడే నేను సోషల్ మీడియాలో అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమాలోని పాటలో యాక్ట్ చేయనందకు ఎంతో సంతోషంగా ఉందని కామెంట్ చేసాను. లేకపోతే గుంపులో గోవిందాగా కలిసిపోయేదాన్ని అంటూ అప్పట్లో చెప్పాను.

అనసూయ భరద్వాజ్ (Youtube/Credit)
దీంతో పవన్ కళ్యాన్ అభిమానులు నన్ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేేసారు. ఏదో తెలియక చేసిన ఈ కామెంట్ వల్ల అప్పట్లో పవన్ ఫ్యాన్స్ వల్ల ఎన్నో ఇబ్బందులకు గురయ్యాను అని ఈ ప్రోమోలో వెల్లడించింది. అంతేకాదు అప్పట్లో మా అమ్మ మా కోసం ఎంతో కష్టపడిందన్నారు. అప్పట్లో ఇంటి అద్దెలు కట్టలేక తక్కువ రెంట్‌కు దొరికే ఇళ్లకు మారిపోయేవాళ్లమన్నారు. అప్పట్లో 50 పైసలు ఆదా చేయడానికి రెండు బస్‌స్టాపులు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అంటూ కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 18, 2020, 9:05 PM IST