దిశా కేసుపై స్పందించిన అనసూయ.. తెలంగాణ పోలీసులకు హాట్సాఫ్..

నిర్భయ తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశా అత్యాచార ఘటన. ఈ సంఘటనపై అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబెకింది. ఈ ఘటనపై అనసూయ భరద్వాజ్ స్పందించింది.

news18-telugu
Updated: December 6, 2019, 10:23 AM IST
దిశా కేసుపై స్పందించిన అనసూయ.. తెలంగాణ పోలీసులకు హాట్సాఫ్..
అనసూయ భరద్వాజ్
  • Share this:
నిర్భయ తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశా అత్యాచార ఘటన. ఈ సంఘటనపై అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబెకింది. తాజాగా దిశా అత్యాచార కేసులో నిందితులను పోలీసులు  ఈరోజు తెల్లవారుఝామున  3.30 గంటలకు ఎన్‌కౌంటర్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద దిశాను పాశవికంగా అత్యాచారం చేసి చంపిన చోటే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసారు.  పోలీసులు వివరాల ప్రకారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును ఎన్‌కౌంటర్ చేసారు. ఇప్పటికే టాలీవుడ్ సినీ నటులు ఈ ఘటనపై ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్.. స్పందించింది. నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసాకా..చాలా హ్యపీగా ఫీలయ్యాని ట్వీట్ చేసింది. తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ అని కొనియాడింది.



Published by: Kiran Kumar Thanjavur
First published: December 6, 2019, 10:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading