నిర్భయ దోషుల ఉరిపై కాస్త వెరైటీగా స్పందించిన అనసూయ..
నిర్భయ దోషుల ఉరిపై కాస్త వెరైటీగా స్పందించిన అనసూయ..
నిర్భయ దోషులపై అనసూయ ప్రతి స్పందన ఇది (Twitter/Photo)
దాదాపు ఏడేళ్ల క్రితం నిర్భయ ఘటన తర్వాత నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు కావడంతో దేశంలోని ప్రజాస్వామ్య వాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ దోషులకు ఉరి విధించడంపై అనసూయ తనదైన శైలిలో స్పందించింది.
దాదాపు ఏడేళ్ల క్రితం నిర్భయ ఘటన తర్వాత నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు కావడంతో దేశంలోని ప్రజాస్వామ్య వాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ నిందితులకు లేటైనా.. తగిన శిక్షనే విధించారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై ప్రముఖ యాంకర్ అనసూయ కూడా స్పందించింది. కాస్త ఆలస్యమైనా... ఓ యువతిపై అతి కిరాతకంగా లైంగిక దాడి చేసి ఆమె మరణానికి కారణమైన వాళ్లు చట్టపరంగా శిక్షింపబడ్డారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు, శిక్ష అమలును మరింత ఆలస్యం చేసేందుకు నిందితులు న్యాయవ్యవస్థలోని అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని చూశారు. అందులో కొంతవరకు విజయం సాధించారు. అయితే చివరకు న్యాయమే గెలిచింది.తాజాగా ఈ కేసులో ఈ రోజు ఉదయం ఈ నలుగురు తీహార్ జైల్లో ఉరి తీయబడ్డారు. ఉరి తర్వాత ఈ నలుగురిని దాదాపు అరగంట సేపు ఉరి కంబంపైనే ఉంచారు. ఆ తర్వాత నలుగురు దోషులను డాక్టర్స్ పరిశీలించి వాళ్లు చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ ఉరిపై అనసూయ హిందీ, ఉర్దూ కలగలపి అర్ధం వచ్చేలా ఇంగ్లీష్‌లో ట్వీట్ చేసింది. ‘ఇన్సాఫ్ కీ సుభాహా.. దేరే సే హి సహీ’ అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు. కాస్త ఆలస్యమైనా.. న్యాయం జరిగింది అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది.
నిర్భయ నిందితులపై అనసూయ చేసిన ట్వీట్ హైదరాబాద్‌లో హిందీ తెలిసిన ప్రేక్షకులకు అర్ధమైన... కొంత మందికి ఆమె ట్వీట్ చేసిన దాన్ని గూగుల్‌లో వెతికి అనసూయ చెప్పిన విషయాన్ని తెలుసుకున్నారు. మొత్తానికి అనసూయ చేసిన ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.