Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: August 10, 2020, 11:00 PM IST
అనసూయ రష్మి శేఖర్ మాస్టర్ (anasuya rashmi sekhar)
అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్.. ఇద్దరూ ఇద్దరే. బుల్లితెరపై వాళ్లకున్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవేమో..? యాంకర్స్ అనే పదం కంటే కూడా హీరోయిన్స్ అంటేనే సరిపోతుందేమో మరి..? అంతగా ఇమేజ్ తెచ్చుకున్నారు అనసూయ, రష్మి. ఇద్దరూ జబర్దస్త్ నుంచే ఫేమస్ అయ్యారు. ఇప్పుడు టాప్‌లో ఉన్నారు. అటు సినిమాలు.. ఇటు షోలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరోవైపు శేఖర్ మాస్టర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అనసూయ రష్మి శేఖర్ మాస్టర్ (anasuya rashmi sekhar)
కొరియోగ్రఫర్ అయినా కూడా హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ తెచ్చుకున్నాడు. పైగా చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఆయనే కావాలంటారు ఇప్పుడు. పైగా బుల్లితెరపై మనోడికి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా రోజుల నుంచి శేఖర్ మాస్టర్ హీరో అవుతాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ హీరోగా రష్మి, అనసూయ హీరోయిన్లుగా ఓ సినిమా రాబోతుంది. అయితే అది నిజం సినిమా కాదు.. ఉత్తుత్తి సినిమా. క్యాష్ లేటెస్ట్ ఎపిసోడ్‌కు వీళ్లంతా వచ్చారు. అందులో హైపర్ ఆది కూడా ఉన్నాడు.
రష్మి, అనసూయ, ఆది, శేఖర్ చేసిన రచ్చ మామూలుగా లేదు. అందరికీ తోడు సుమ కూడా ఉండనే ఉంది. దాంతో హద్దుల్లేని కామెడీ అక్కడ పేలింది. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్‌ను టార్గెట్ చేసి హైపర్ ఆది అదిరిపోయే పంచులు వేసాడు. అక్కడే శేఖర్ మాస్టర్ సినిమా గురించి కూడా చెప్పుకొచ్చింది సుమ. అనసూయ, రష్మి హీరోయిన్లుగా శేఖర్ మాస్టర్ హీరోగా సినిమా చేస్తే దానికి టైటిల్ ఏంటి అని అడగ్గానే హైపర్ ఆది అదిరిపోయే పంచ్ వేసాడు. ఆయనొస్తే అంతే అంటూ డబుల్ మీనింగ్ టైటిల్ పెట్టేసాడు. దెబ్బకు అక్కడున్న సుమతో పాటు అందరూ కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
Published by:
Praveen Kumar Vadla
First published:
August 10, 2020, 11:00 PM IST