Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Anasuya Bharadwaj : జబర్దస్త్ భామ అనసూయకు అనుకోని కష్టాలు..

    Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల హాట్ యాంకర్.

    news18-telugu
    Updated: October 17, 2020, 7:01 AM IST
    Anasuya Bharadwaj : జబర్దస్త్ భామ అనసూయకు అనుకోని కష్టాలు..
    అనసూయ Photo : Instagram
    • Share this:
    Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల హాట్ యాంకర్. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా.. సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా.. అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. రంగస్థలంలో ఈ భామ చేసిన నటనకు ఫిదా అయిన కృష్ణ వంశీ.. తన రంగ మార్తండలో ఛాన్స్ ఇచ్చాడట. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. అంతేకాదు ఈ సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నటించాల్సి ఉంటుందట. అనసూయ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రానుందట. ఆ విధంగా కృష్ణవంశీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎంతో ఆశగా ఈ సినిమాను థియెటర్‌లో విడుదల చేద్దామని అనుకుంటే ఈ కరోనా వల్ల అది కుదిరేలా లేదు.

    ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా లాక్ డౌన్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది. ఇంకా ఫైనల్ షెడ్యూల్ ఒకటి మిగిలి ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. కృష్ణవంశీ సైతం చిత్రాన్ని అన్ని విధాలా గొప్పగా ఉండేలా రూపొందిచాలని అనుకున్నారు. అందులో భాగంగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజాగారి చేత సంగీతం చేయించుకున్నాడు. అంతేకాదు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి సీనియర్ నటీనటుల్ని తీసుకున్నాడు. ఇంత గొప్పగా ప్లాన్ చేసిన ఆయన చివరకు సినిమాను థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకుంటున్నాడట. కారణం కరోనా రీత్యా సినిమా హాళ్లకు ఇప్పుడప్పుడే నార్మల్ పరిస్థితి వచ్చేలా కనిపించట్లేదు. ప్రేక్షకులు పూర్తిగా థియేటర్ల వైపుకు రావాలంటే ఇంకో రెండు మూడు నెలలు పట్టేలా ఉంది. దీంతో సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

    ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక నటిస్తున్నారు.
    Published by: Suresh Rachamalla
    First published: October 17, 2020, 6:54 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading