Anasuya Bharadwaj: జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుంటుందా... కారణాలు అవేనా.. ?

Anasuya Bharadwaj | జబర్దస్త్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ త్వరలోనే ఈ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పనుందా ? అంటే ఔననే అంటున్నాయి సినీ,మీడియా వర్గాలు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: June 17, 2019, 5:27 PM IST
Anasuya Bharadwaj: జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుంటుందా... కారణాలు అవేనా.. ?
యాంకర్ అనసూయ Photo: Instagram
news18-telugu
Updated: June 17, 2019, 5:27 PM IST
జబర్దస్త్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ త్వరలోనే ఈ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పనుందా ? అంటే ఔననే అంటున్నాయి సినీ,మీడియా వర్గాలు. వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్ షోను తన యాంకరింగ్‌తో మెప్పించిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకుంది. సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమిత కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో మెప్పించడం విశేషం. ముఖ్యంగా ‘క్షణం’,‘రంగస్థలం’ సినిమాలు నటిగా అనసూయకు మంచి పేరు తీసుకొచ్చాయి. అదే ఊపులో ఇపుడు అనసూయ ప్రదాన పాత్రలో ‘కథనం’ సినిమ ా కూడా తెరకెక్కింది. తాజాగా ఈ భామకు వరుసగా సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఈమె జబర్ధస్త్‌ ప్రోగ్రాంకు, సినిమాలకు టైమ్ కేటాయించలేకపోతున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇపుడు చేస్తోన్న జబర్థస్త్ ప్రోగ్రాంకు కాస్తంత విరామిచ్చి పూర్తిగా తన సమయాన్ని సినిమాలకు కేటాయించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

మొత్తానికి జబర్ధస్త్ పోగ్రాంతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న అనసూయ.. ఇపుడు వరుసగా సినిమా అవకాశాలతో జబర్దస్త్‌కు విరామం ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మొత్తానికి ఉప్పు లేని పప్పు.. మసాలా లేని కూరల అనసూయ లేని జబర్ధస్త్ ప్రోగ్రాం చూడటం అభిమానులకు కాస్తంత నిరాశ కలిగించే అంశమనే చెప్పాలి.



First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...