news18-telugu
Updated: November 27, 2020, 8:33 PM IST
అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)
Anasuya Bharadwaj | తెలుగు టెలివిజన్ ఆడయన్స్కు అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఈమె ఒకవైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ భామ. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. మరీ ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. గత ఏడాది ‘కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తుంది. ఇక అందరి కెరీర్లు పెళ్లి తర్వాత కంచికి చేరితే.. ఈమె కెరీర్ మాత్రం పెళ్లి తర్వాత మూడు ఆఫర్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది.
మ్యారేజ్ తర్వాత కూడా కెరీర్ ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చా అని మిగిలిన హీరోయిన్లు, యాంకర్స్ కుళ్లుకునేలా అనసూయ కెరీర్ రాకెట్లా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు టీవీలో షోలు చేస్తూనే.. మరోవైపు నచ్చిన సినిమాలు కూడా ఒప్పుకుంటుంది. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా చేస్తుంది. కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైపోయింది. అశ్విన్ విరాజ్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్.. ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో నటిస్తోంది.

‘థాంక్యు యు బ్రదర్’ మూవీలో అనసూయ (Twitter/Photo)
దానికి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్.. రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో అనసూయ భరద్వాజ్ గర్భంతో ఉంది. సోషల్ మెసెజ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో అనసూయ మరోసారి ఆడియన్స్‌ను మాయ చేస్తుందా లేదా చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 27, 2020, 8:33 PM IST