అనసూయ అందానికి అసలు సీక్రేట్ వైన్ తాగడమంట..

Anasuya Bharadwaj: పెళ్లై పదేళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అలాంటప్పుడు కచ్చితంగా ఆమెను అమ్మాయి కాదు ఆంటీ అనాల్సిందే. పైగా గ్లామర్ కూడా ఏం ఉంటుంది.. పోయుంటుంది అనుకుంటారంతా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 20, 2020, 8:22 PM IST
అనసూయ అందానికి అసలు సీక్రేట్ వైన్ తాగడమంట..
అనసూయ భరద్వాజ్ (Anasuya bharadwaj)
  • Share this:
పెళ్లై పదేళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అలాంటప్పుడు కచ్చితంగా ఆమెను అమ్మాయి కాదు ఆంటీ అనాల్సిందే. పైగా గ్లామర్ కూడా ఏం ఉంటుంది.. పోయుంటుంది అనుకుంటారంతా. కానీ యాంకర్ అనసూయను చూస్తుంటే మాత్రం అలా అనిపించదు. పెళ్లైనా.. తల్లైనా కూడా ఇప్పటికీ హీరోయిన్‌లను కూడా డామినేట్ చేసే అందం ఆమె సొంతం. పైగా గ్లామర్ షో కూడా అలాగే చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్లైనా కూడా మీ అందం అంతగా ఉండటానికి సీక్రేట్ ఏంటి కాస్త చెప్పరూ అంటూ అభిమానులు కూడా ఆమెను తరుచు అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఈమె తన గ్లామర్ సీక్రేట్ చెప్పేసింది.
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)


రెడ్ వైన్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పింది అనసూయ. అది గుండెకు చాలా మంచిదని వివరించింది ఈ జబర్దస్త్ యాంకర్. ఆకలిగా ఉన్న సమయంలో నిద్ర పట్టదని.. దీంతో రాత్రి నిద్రపోయే ముందు తాను భోజనానికి బదులు రెడ్ వైన్ తాగుతానని చెప్పింది ఈ బ్యూటీ. అందరికీ తనలాగే రెడ్‌ వైన్‌ తాగితే నిద్ర పట్టే అవకాశాలున్నాయని చెప్పలేమని తెలిపింది అనసూయ భరద్వాజ్.
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)

కొందరు మాత్రం తమ గ్లామర్ కాపాడుకోవడం కోసం రెడ్ వైన్ తాగుతుంటారు.. అందులో అనసూయ కూడా ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు లేక ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్న అనసూయ ప్రస్తుతం మళ్లీ బిజీ అయిపోయింది. జబర్దస్త్ షోతో పాటు మరిన్ని కూడా చేస్తుందిప్పుడు. ఏదేమైనా కూడా రెడ్ వైన్ తన అందానికి సీక్రేట్ అంటుంది ఈ జబర్దస్త్ యాంకర్.
First published: June 20, 2020, 8:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading