Home /News /movies /

ANASUYA BHARADWAJ MORE GLAMOUROUS IN LATEST EPISODE OF JABARDASTH COMEDY SHOW TA

Anasuya: గ్లామర్ డోస్ పెంచేసిన అనసూయ.. ఫ్యాన్స్‌కు జబర్ధస్త్ భామ అందాల విందు..

పొట్టి డ్రెస్‌లో డాన్స్‌తో కెేక పుట్టిస్తోన్న అనసూయ భరద్వాజ్ (Instagram/Photo)

పొట్టి డ్రెస్‌లో డాన్స్‌తో కెేక పుట్టిస్తోన్న అనసూయ భరద్వాజ్ (Instagram/Photo)

Anasuya Bharadwaj | తెలుగు టెలివిజన్ ఆడయన్స్‌కు  అనసూయ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా ఈ భామ జబర్ధస్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో తనదైన గ్లామర్‌తో మరోసారి రెచ్చిపోయింది.

    Anasuya Bharadwaj | తెలుగు టెలివిజన్ ఆడయన్స్‌కు  అనసూయ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈమె ఒక వైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. మరీ ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. గత ఏడాది ‘కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తుంది. ఇక అందరి కెరీర్‌లు పెళ్లి తర్వాత కంచికి చేరితే.. ఈమె కెరీర్ మాత్రం పెళ్లి తర్వాత మూడు ఆఫర్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. తాజాగా ఈమెకు సిల్క్ స్మిత బయోపిక్ ఆఫర్ వచ్చింది. కానీ ఫైనల్‌గా ఈ మూవీ ఆఫర్‌ను తిరస్కరించింది.

    తాజాగా ఈ భామ.. జబర్ధస్త్ కామెడీ షోలో మరోసారి తనదైన పొట్టి పొట్టి దుస్తులతో ఆడియన్స్‌ను మరోసారి అట్రాక్ట్ చేసే పనిలో పడింది. తాజాగా ఎపిసోడ్‌లో ‘చిరుత’ సినిమాలో చమ్ కా చమ్ కారే’ పాటకు తనదైన స్టెప్పులతో అలరించింది. ముఖ్యంగా పొట్టి డ్రెస్‌తో అనసూయ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



    అనసూయ విషయానికొస్తే.. ఈమె  మ్యారేజ్ తర్వాత కూడా కెరీర్ ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చా అని మిగిలిన హీరోయిన్లు, యాంకర్స్ కుళ్లుకునేలా రాకెట్‌లా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు టీవీలో షోలు చేస్తూనే.. మరోవైపు నచ్చిన సినిమాలు కూడా ఒప్పుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ ‘థ్యాంక్ యూ బ్రదర్’ అనే సినిమా చేస్తుంది. కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైపోయింది. అశ్విన్ విరాజ్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్.. ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Television News, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు