తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో నటించినా అంతగా గుర్తింపు రాని అనసూయ.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో ఒక్కసారిగా అనసూయకు అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె చిరంజీవి, కొరటాల శివ సినిమాతో సుకుమార్, అల్లు అర్జున్ సినిమాల్లో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా అనసూయ.. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చాలా యేళ్ల తర్వాత తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
I’ve always been so inspired by his films.. to be like the girls in his films.. lively and rooted.. soft yet strong.. no matter what..
It’s a dream to be able to take orders from him on the sets .. @director_kv Sir!! CHECK✔️#BucketList #checked #blessed #RANGAMARTHANDA 🎥 https://t.co/7QxTFC9JqV
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 17, 2019
సంప్రదాయ చీర కట్టులో తెలుగుదనం ఉట్టి పడేలా ఉన్న అనసూయ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘రంగ మార్తాండ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనసూయ.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కూతురు పాత్రలో నటిస్తోంది. అనసూయ పాత్రే ఈ సినిమాలో కథలో కీలకం అని చెబుతున్నారు. అందుకే కృష్ణ వంశీ ఏరికోరి అనసూయను ఈ పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ‘రంగమార్తాండ’ సినిమా విషయానికొస్తే.. ఓ సినీయర్ నటుడిని అతడి పిల్లలు చివరి రోజుల్లో ఎలా నిర్లక్ష్యం చేసారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా మరాఠీలో నానా పాటేకర్ ముఖ్యపాత్రలో నటించిన ‘నటసమ్రాట్’ సినిమాకు రీమేక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Krishna vamsi, Prakash Raj, Ramya Krishna, Ranga Marthanda, Telugu Cinema, Tollywood