Anasuya Bharadwaj - Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావుకు అనసూయ భరద్వాజ్ జబర్ధస్త్ కౌంటర్.. మూసుకోని కూర్చో అంటూ..

అనసూయ, కోట శ్రీనివాస రావు (Twitter/Photo)

Anasuya Bharadwaj - Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావుకు అనసూయ భరద్వాజ్ జబర్ధస్త్ కౌంటర్ ఇచ్చింది. తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు అనసూయ భరద్వాజ్.. డ్రెసింగ్స్ పై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే కదా.

 • Share this:
  Anasuya Bharadwaj - Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావుకు అనసూయ భరద్వాజ్ జబర్ధస్త్ కౌంటర్ ఇచ్చింది. తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు అనసూయ భరద్వాజ్.. డ్రెసింగ్స్ పై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కోట శ్రీనివాస రావు విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన ‘ప్రాణం ఖరీదు’తో తొలిసారి వెండితెరపై మెరిసారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తిరిగి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తెలుగులో ఎలాంటి విలక్షణ పాత్రలో ఇట్టే ఒదిగిపోవడం ఆయన నైజం. గత కొన్ని రోజులుగా ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అంతేకాదు మొన్నటి మొన్న ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ .. ఏ రోజు షూటింగ్‌కు టైమ్‌కు రాలేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

  అంతేకాదు తెలుగు వాళ్లకు మాత్రమే మా అసోసియేషన్ పీఠంపై కూర్చునే హక్కు ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై నాగబాబు లాంటి వాళ్లు విరుచుకుపడ్డారు. ఆయన వయసుకు తగ్గట్లు మాట్లాడాలంటూ హెచ్చరించారు. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీలోని కొందరు నటులు, షోలపై విరుచుకుపడ్డాడు ఈ సీనియర్ నటుడు. ముఖ్యంగా జబర్దస్త్ షోను టార్గెట్ చేసారు కోట. ఈ సందర్భంగా ఈ షోలో జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. పొట్టి డ్రెస్సులు వేసుకోవడంపై కామెంట్స్ చేసారు.

  Venkatesh Multistarers : అబ్బాయి రానాతో కాకుండా.. మరో క్రేజీ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ..


  దీనికి అనసూయ భరద్వాజ్ కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఎటాక్ చేసింది. ఈమె ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై కూడా స్టార్ యాంకర్‌గా రాణిస్తుంది. రెండు చోట్లా అందాలు ఆరబోయడం మాత్రం కామన్. తనదైన గ్లామర్ యాంకరింగ్‌తో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది అనసూయ. హీరోయిన్లతో సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటుంది జబర్దస్త్ భామ.

  NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..


  ఇప్పటికే పలువురు నెటిజన్లు అనసూయ డ్రెసింగ్ పై పలు సందర్భాల్లో ట్రోల్ చేసారు. అపుడు అనసూయ అంతే గట్టిగా స్పందించింది. ఇక కోట శ్రీనివాస రావు.. అనసూయ యాంకరింగ్ నచ్చుతుంది అని చెబుతూనే.. ఆమె డ్రెసింగ్ మాత్రం తనకు నచ్చలేదన్నారు. దీనిపై అనసూయ భరద్వాజ్ కాస్త ఘాటుగానే స్పందించింది.

  Chiranjeevi Dual Roles: చిరంజీవి ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారా.. తెలుసా..


  ఇక్కడ అనసూయ భరద్వాజ్ ఆయన పేరు ఎక్కడ చెప్పుకుండా.. ఓ సీనియర్ నటుడు తన డ్రెసింగ్ పై కామెంట్స్ చేసారు. ఆయనకు తెలియదు అనుకుంటా.. వృత్తిలో భాగంగా హీరోయిన్స్‌తో పాటు మిగతా నటీనటులు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు. మరోవైపు ఆ నటుడు నటించిన ఎన్నో సినిమాల్లో స్త్రీలను కించ పరిచే సన్నివేశాలుండటంతో పాటు.. ఆయన అందులో నటించారు కూడా. వాటి గురించి ఎవరు పట్టించుకోరు. నటనలో భాగంగా ఆయన అలా చేసారు. నేను కూడా అలానే చేసాను అంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఎటాక్ చేసింది అనసూయ.  నాకు మ్యారేజ్ కావడంతో పాటు ఇద్దరు పిల్లున్నారు. నేను చేస్తోన్న వృత్తిలో పైకి ఎదగడానికి కష్టపడుతున్నాను. అది నచ్చకపోతే.. నేనేమి చేయలేను. దయచేసి మీ పని మీరు చూసుకోండి. అనవసరంగా ఇతరులపై మీ అభిప్రాయాలను చెప్పడం మానుకోండి అంటూ కోటకు బదులిచ్చింది. మొత్తంగా అనసూయ.. కోటకి బదులివ్వడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: