Anasuya Bharadwaj: మెగా హీరో షూటింగ్లో జాయిన్ అయిన జబర్ధస్త్ భామ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. ఈమె గురించి చెప్పాలంటే స్మాల్ స్క్రీన్‌లో జబర్థస్త్ వంటి కామెడీ షో యాంకర్‌గా యూత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన ’క్షణం’ మూవీలో తనదైన విలనిజాన్ని పండించింది. అంతకు ముందు నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో టైటిల్ సాంగ్‌లో అదరగొట్టింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా తనదైన నటనను ప్రదర్శించింది ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత కథానాయికగా కూడా అనసూయకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ భామ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. రీసెంట్గా ‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో నటించింది. అందులో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ఒకటి.
రష్మిక మందన్న ఈ సినిమాలో కథానాయిక నటిస్తోంది. ఈ చిత్రంలో అనసూయ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే అనసూయపై కొన్ని కీలక సన్నివేశాలను సుకుమార్ పిక్చరైజ్ చేసారు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు. తాజాగా ఈ రోజు షూటింగ్లో అనసూయ తిరిగి జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్లో అనసూయ, అల్లు అర్జున్, రష్మికలపై కొన్ని కీలక సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కించనున్నారు.
‘పుష్ప’గా అల్లు అర్జున్ (Instagram/Photo)
అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరో రెండు సినిమాలు చేస్తోంది. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. ఈ సినిమాతో పాటు అనసూయ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమాలో యాక్ట్ చేస్తోంది.
అల్లు అర్జున్ అనసూయ భరద్వాజ్ (anasuya allu arjun)
ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ సికింద్రాబాద్‌లో జరుగుతోంది. ఆ తర్వాత శేషాచలం అడవుల్లో చేయనున్నారు. ఈ షెడ్యూల్ కంటిన్యూ 45 రోజులు ఉండనుంది. దీంతో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ కానుంది. ఈ సినిమా స్టోరీ నిడివి ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే కదా. సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం కూడా డిఫరెంట్‌గా కొత్తగా ఉంది. ఈ చిత్రాన్ని ఈ యేడాది చివరల్లో విడుదల చేయనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.