Anasuya Bharadwaj: కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని విభిన్న పాత్రలో అనసూయ భరద్వాజ్..

అనసూయ భరద్వాజ్(anasuya Instagram)

Anasuya Bharadwaj: కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని విభిన్న పాత్రలో అనసూయ భరద్వాజ్ చేయనున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Anasuya Bharadwaj: కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని విభిన్న పాత్రలో అనసూయ భరద్వాజ్ చేయనున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. అనసూయ భరద్వాజ్ .. జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోతో ఈమె బాగానే పాపులర్ అయ్యారు. ఈమె ఒక వైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్‌ బిజీగా గడుపుతూ ఉంది. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి.  ‘కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. దాంతో పాటు సునీల్ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తుంది. ఇక అందరి కెరీర్‌లు పెళ్లి తర్వాత కంచికి చేరితే.. ఈమె కెరీర్ మాత్రం పెళ్లి తర్వాత మూడు ఆఫర్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతూనే ఉంది.

    అంతేకాదు ఇపుడు ఈ భామ.. చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది. మరోవైపు త్వరలో తమిళం, మలయాళంలో కూడా అరంగేట్రం చేయనుంది. ఆ సంగతి పక్కనపెడితే.. అనసూయ భరద్వాజ్..త్వరలో ఓ వేశ్యపాత్రలో నటించనుంది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ఈమె ప్రాస్టిట్యూట్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన చేయనున్నారు. మొత్తంగా అనసూయ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏ విధమైన పాత్ర చేయడానికైనా సై అంటోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: