Anasuya Bharadwaj: కేరళ అందాలను మరిచిపోలేకపోతున్న జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్..

అనసూయ భరద్వాజ్ (Anasuya Photo : Instagram)

Anasuya Bharadwaj: జబర్ధస్త్ కామెడీ  కేరళ అందాలను ఆస్వాదిస్తోన్న జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్..జబర్ధస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

  • Share this:
    Anasuya Bharadwaj: జబర్ధస్త్ కామెడీ  కేరళ అందాలను ఆస్వాదిస్తోన్న జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్..జబర్ధస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అనసూయ.. జబర్ధస్త్ షో చేస్తూనే మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక జబర్థస్త్ షోలో ప్రతి వారం ఏదో ఒక సూపర్ పాటకు డాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.  అంతేకాదు ఈ షోను  తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక  ‘క్షణం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్. అంతేకాదు ఎప్పటి కపుడు లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. ఇక అనసూయ పాపులారిటీ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. పక్కనున్న భాషలకు పాకింది. ప్రస్తుతం ఈ భామ పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మరోవైపు మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఈ భామను ఎంపిక చేసినట్టు సమాచారం.

    ఆ మధ్య  ఈ భామ మలయాళ సినిమా షూటింగ్‌లో భాగంగా కేరళలోని కొచ్చి షూటింగ్‌లో భాగంగా తాను గడిపిన పాత జ్జాపకాలను అభిమానులతో షేర్ చేసుకుంది. . ఈ సందర్భంగా అక్కడ ప్రకృతి ఒడిలో సేద తీరిన ఓ వీడియోను అభిమానులో పంచుకుంది. అంతేకాదు అవకాశం వస్తే మరోసారి కేరళ అందాలను ఆస్వాదించాలని ఉందని పేర్కొంది.




    అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం రవితేజ హీరోగా  నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు అనసూయ.. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’లో కీ రోల్ పోషిస్తోంది. మరోవైపు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: