హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya Bharadwaj : పోలీసుల అదుపులో జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..

Anasuya Bharadwaj : పోలీసుల అదుపులో జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..

అనసూయ భరద్వాజ్ (Anasuya Photo : Instagram)

అనసూయ భరద్వాజ్ (Anasuya Photo : Instagram)

Anasuya Bharadwaj : పోలీసుల అదుపులో జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. వివరాల్లోకి వెళితే..

  Anasuya Bharadwaj : పోలీసుల అదుపులో జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj).. వివరాల్లోకి వెళితే.. గత  కొన్నేళ్లుగా అనసూయ భరద్వాజ్ ఓ వైపు జబర్ధస్త్ కామెడీ షోలతో పాటు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ప్రతి వారం.. జబర్ధస్త్ కామెడీ షోలో ఏదో ఒక సూపర్ హిట్ పాటకు డాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.  అంతేకాదు ఈ షోను  తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక  ‘క్షణం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్. అంతేకాదు ఎప్పటి కపుడు లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది.

  ఇక అనసూయ పాపులారిటీ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. పక్కనున్న భాషలకు పాకింది. ప్రస్తుతం ఈ భామ పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మరోవైపు మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఈ భామను ఎంపిక చేసారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  అంతేకాదు తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ‘పుష్ప’ లో అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఈమెపై కొన్ని జైలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా అనసూయను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారు. అనసూయ జైల్ సీన్స్ ఈ సినిమాలో కీలకం అని చెబుతున్నారు.

  Rajinikanth - Mano: రజినీకాంత్‌కు మనో మొదటిసారి డబ్బింగ్ చెప్పిన సినిమా ఏంటో తెలుసా..

  మరోవైపు అనసూయ భరద్వాజ్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈమె ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం రవితేజ హీరోగా  నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది.

  Ashwini Dutt - K Raghavendra Rao : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, దర్శకుడు కే రాఘవేంద్రరావు టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్..

  ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. మొత్తంగా అనసూయ కెరీర్ మూడు పోగ్రాములు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Tollywood

  ఉత్తమ కథలు