వాటిపై మనసు పడ్డ అనసూయ భరద్వాజ్..

జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఈమె గురించి సెపరేట్‌గా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా ఈమె చేనేత కార్మికులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చింది.

news18-telugu
Updated: June 17, 2020, 1:44 PM IST
వాటిపై మనసు పడ్డ అనసూయ భరద్వాజ్..
'గుంపులో గోవిందా' అన్నట్టు ఆ పాట చెయ్యడం వల్ల తనకు కలిసొచ్చేది ఏమీ లేదు అనేది తన ఉద్దేశమని.. కానీ తన ఉద్దేశం అర్దం చేసుకోకుండా పవన్ ఫ్యాన్స్ తనను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారని గుర్తు చేసుకుంది.
  • Share this:
జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఈమె గురించి సెపరేట్‌గా పరిచయాలు అక్కర్లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. ఇఫ్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్‌లో కూడా దూసుకుపోతూ వరస సంచలనాలు చేస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. న్యూ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తుంది అనసూయ. ఎపుడు సినిమాలే కావు.. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె వరంగలో జిల్లాలోని కొత్తవాడలోని చేనేత కార్మికులు నేసే దర్సీస్ పై ఈమె మనసు పారేసుకుంది. దర్రీస్ అంటే ఒక రకమైన కార్పెట్లు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో అనసూయ పాల్గొని ఈ  కార్పెట్ల తయారినీ మెచ్చుకుంది.  ప్రస్తుతం 3 లక్షల కార్పెట్లు వాళ్ల వద్ద స్టాక్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె తన తోటి సినీ నటులు,  స్నేహితులతో పాటు ప్రజలందరు  కలిసి ఈ కార్పెట్లు కొని వీళ్లను ఆదుకోవాలని పిలుపునిచ్చింది.  అంతేకాదు పోచంపల్లి నేత కార్మికుల ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యంతో పాటు.. 5  కిలోల కందిపప్పుతో పాటు కిలో నూనె చొప్పున 40 మందికి అందజేసింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 17, 2020, 1:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading