హైపర్ ఆది, అనసూయ కెమిస్ట్రీ అక్కడ కూడా వర్కౌట్ అయ్యిందిగా..

అనసూయ, హైపర్ ఆది

ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మి-సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కావడంతో జబర్దస్త్‌లో ఆ ఫ్లేవర్‌ని కొనసాగిస్తున్నారు అనసూయ-హైపర్ ఆదిలు. తాజాగా వీళ్లిద్దరు మరో ప్రోగ్రామ్‌లో తమ కెమిస్ట్రీ అలానే కంటిన్యూ చేస్తున్నారు.

 • Share this:
  ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మి-సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కావడంతో జబర్దస్త్‌లో ఆ ఫ్లేవర్‌ని కొనసాగిస్తున్నారు అనసూయ-హైపర్ ఆదిలు. జబర్దస్త్ తో పాటు తాము పార్టిసిపేట్ చేసే ఇతర షోలను సక్సెస్ చేసుకోవడానికి తమ స్కిట్ లకు ప్రత్యేకంగా రొమాంటిక్ టచ్ ఇచ్చే పని సుడిగాలి సుధీర్ టీమ్ చేస్తూ వస్తున్నారు. ఇది చాలా కాలంగా కొనసాగుతోంది. ఇది ఎంత సక్సెస్ అయిందంటే, సుధీర్ కు రష్మీకి మధ్య ఏదో ఉందని గాసిప్స్ ఒక దశలో నెటింటిని షేక్ చేశాయి. ఇదిలాఉంటే ఇదంతా పక్కన పెడితే, కొత్తగా మరో జంట ఇటువంటి ప్రయత్నాలతో వీక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. జబర్దస్త్ జోడీల్లో అనసూయ, హైపర్ ఆదిలకు ప్రత్యేక స్థానం ఉంది. యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు.. ఇక హైపర్ ఆది ఆమెపై పంచుల మీద పంచులేస్తుంటాడు. అలాగే అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు. తాజాగా ఈ ఆ పంచ్ లలో రొమాంటిక్ డోస్ పెరిగుతూ వస్తోంది.

  Anchor Anasuya angry on Hyper Aadi,Anasuya angry on Hyper Aadi,Anchor Anasuya angry,Anchor Anasuya angry on,angry on Hyper Aadi,Anchor Anasuya on Hyper Aadi,Anchor Anasuya about Hyper Aadi,Anchor Anasuya with Hyper Aadi,Hyper Aadi about Anchor Anasuya,Jabardasth Latest Episodes,hyper aadi punch on anasuya,hyper aadi comments on anasuya,hyper aadi touches anasuya,hyper aady hugging anasuya,hyper aadi anasuya dance,hyper aadi dance with anasuya,Top Telugu TV
  అనసూయ, హైపర్ ఆది


  మొన్నటికి మొన్న వచ్చిన జబర్దస్త్ ఎపిసోడ్లో ఆదిని అనసూయ బావా అంటూ వయ్యారంగా పిలవడం ఇంకా జబర్దస్త్ ప్రేక్షకుల మదిని దాటి పోలేదు. ఇప్పుడు జబర్దస్త్ కాకుండా కూడా ఇతర షో లలోనూ అనసూయ..హైపర్ ఆదిల మధ్య రొమాన్స్ ని చూపిస్తూ ప్రోమోలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 'ప్రతి రోజు పండగే' (బ్రాండ్ న్యూ లేడీస్) అనే లేటెస్ట్ టెలివిజన్ షో ఒకటి ప్రసారం అవుతోంది. దీనికి అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసమే డిజైన్ చేసిన షో. తాజాగా ఈ షో ప్రోమో వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇందులో అనసూయ ప్రేమ కోసం హైపర్ ఆది ప్రయత్నాలు హైలైట్‌గా నిలిచాయి.అందులో భాగంగా త్వరలో ప్రారంభం కాబోతున్న ప్రతిరోజూ పండగే షో ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: