అనసూయ భరద్వాజ్‌ను కదిలించిన బాలనటుడు గోకుల్ సాయి మరణం..

నూరేళ్ల జీవితం అంటారు.. కానీ ఆ నూరేళ్ల జీవితం పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే ముగిస్తే ఆ తల్లిదండ్రులకు అంతకంటే శోకం మరోటి ఉండదు. పైగా అతడు భవిష్యత్తు తార అయితే ఇండస్ట్రీలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 18, 2019, 7:17 PM IST
అనసూయ భరద్వాజ్‌ను కదిలించిన బాలనటుడు గోకుల్ సాయి మరణం..
అనసూయ భరద్వాజ్ గోకుల్ సాయి
  • Share this:
నూరేళ్ల జీవితం అంటారు.. కానీ ఆ నూరేళ్ల జీవితం పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే ముగిస్తే ఆ తల్లిదండ్రులకు అంతకంటే శోకం మరోటి ఉండదు. పైగా అతడు భవిష్యత్తు తార అయితే.. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుడతడు అయితే.. ఇక ఆ కన్నీటికి అడ్డే ఉండదు. ఇప్పుడు చిన్నారి గోకుల్ మరణం అందర్నీ ఇలాగే కంటతడి పెట్టిస్తుంది. బాలయ్య అభిమానిగా ఈ కుర్రాడు చాలా ఫేమస్. ఆయన ఇంటి ముందే ఓ సారి ప్రదర్శన ఇచ్చి బాలయ్యతోనే ప్రశంసలందుకున్న చిచ్చరపిడుగు. అలాంటి గోకుల్ డెంగ్యూతో బాధ పడుతూ మరణించాడు.

Anasuya Bharadwaj got very emotional about the sudden death of child actor Gokul Sai and posted a video pk నూరేళ్ల జీవితం అంటారు.. కానీ ఆ నూరేళ్ల జీవితం పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే ముగిస్తే ఆ తల్లిదండ్రులకు అంతకంటే శోకం మరోటి ఉండదు. పైగా అతడు భవిష్యత్తు తార అయితే ఇండస్ట్రీలో.. anasuya bharadwaj,anasuya bharadwaj gokul sai,anasuya bharadwaj twitter,anasuya bharadwaj videos,jabardasth anasuya bharadwaj,anasuya bharadwaj emotional,extra jabardasth,balakrishna fan gokul sai,jabardasth comedy show,gokul sai death,child artist gokul sai,gokul sai krishna,gokul sai drama juniors,gokul sai videos,junior artist gokul sai,child artist gokul sai krishna died due to dengue fever,gokul sai passes away,child artist gokul sai no more,gokul sai,child artist passes away,artist gokul,child artist gokul sai died,gokul sai death,drama juniors gokul sai death,child artist gokul sai krishna,anasuya bharadwaj hot show,telugu cinema,anasuya bharadwaj hot stills,anasuya bharadwaj hot photos,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ గోకుల్ సాయి,గోకుల్ సాయి మరణం,బాలనటుడు గోకుల్ సాయి మరణం,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్ గోకుల్ సాయి


ఈ కుర్రాడి మరణం బాలయ్యను కూడా కదిలించింది. తన మరణాన్ని చూసి తట్టుకోలేక అభిమానులకు ఓ ఎమోషనల్ లెటర్ కూడా రాసాడు బాలకృష్ణ. ఇదిలా ఉంటే ఈ కుర్రాడితో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దానికి కారణం డ్రామా జూనియర్స్. జీ ఛానెల్లో వచ్చే ఈ రియాలిటీ షోలో గోకుల్ కూడా పార్టిసిపెంట్. చాలా రోజులుగా అక్కడే పర్ఫార్మ్ చేస్తున్నాడు ఈ చిన్నారి. గోకుల్ మరణవార్త విన్న అనసూయ షాక్ అయింది. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పి ఏడ్చేసింది. తనతో ఉన్న అనుబంధాన్ని.. సెట్లో గోకుల్ చేసిన అల్లరిని గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

అనసూయ భరద్వాజ్ గోకుల్ సాయి
బాలయ్య అభిమాని గోకుల్ (Facebook/Photo)


డ్రామా జూనియర్స్‌లో తనకు ఫేవరెట్ కంటెస్టెంట్స్‌లో గోకుల్ కూడా ఉండేవాడని.. బాలయ్యను అద్భుతంగా అనునయించేవాడని గుర్తు చేసుకుంది అనసూయ. అతడితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది అను. ఇంత చిన్న వయసులోనే అందరికీ దూరమవ్వడం అనేది జీర్ణించుకోలేని విషయం అని.. గోకుల్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేసింది అనసూయ భరద్వాజ్. డ్రామా జూనియర్స్ ఓ అద్భుతమైన టాలెంట్ మిస్ అయిపోయిందని బాధ పడింది. అంతేకాదు.. తెలుగు ఇండస్ట్రీ కూడా బాలనటుడిని కోల్పోయిందని కన్నీరు పెట్టుకుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 18, 2019, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading