ANASUYA BHARADWAJ GOT CHANCE TO ACT IN ALLU ARJUN SUKUMAR UPCOMING MOVIE AK
అనసూయకు మరో బంపర్ ఆఫర్... రెండోసారి ...
అనసూయ
Anasuya bharadwaj | అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ దశలోనే క్యారెక్టర్స్‌కు ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసుకునే సుకుమార్... అనసూయ కోసం ఓ మంచి క్యారెక్టర్‌ను ఫిక్స్ చేశారని టాక్.
టాలీవుడ్లో అందాల యాంకర్ అనసూయకు క్రేజీ ఆఫర్లు పెరుగుతున్నాయి. రామ్ చరణ్ సరసన రంగస్థలంలో రంగమ్మత్తుగా నటించిన అనసూయ... త్వరలోనే చిరంజీవి నయా మూవీలోనూ నటించనుంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో అనసూయ రోల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సంగతి అలా ఉంటే... అనసూయకు టాలీవుడ్’లో మరో అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ క్రేజీ యాంకర్‌కు రంగమ్మత్త వంటి రోల్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన దర్శకుడు సుకుమార్... తన కొత్త సినిమాలోనూ ఆమె కోసం ఓ మంచి పాత్రను క్రియేట్ చేశారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ దశలోనే క్యారెక్టర్స్‌కు ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసుకునే సుకుమార్... అనసూయ కోసం ఓ మంచి క్యారెక్టర్‌ను ఫిక్స్ చేశారని టాక్. ఈ నయా మూవీలో అనసూయది ఫుల్ లెంగ్త్ రోల్ అని... ఇందుకోసం ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టిందని సమాచారం. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ సినిమాపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి.
రంగస్థలం సినిమాతో రామ్ చరణ్‌కు మంచి హిట్ ఇచ్చిన సుకుమార్... అల్లు అర్జున్‌కు కూడా అదే రేంజ్ సక్సెస్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి సుకుమార్ ఇచ్చిన ఫస్ట్ ఛాన్స్‌ను ఎంతగానో యూజ్ చేసుకున్న అనసూయ... నెక్ట్స్ ఛాన్స్‌ను కూడా అదే రేంజ్లో ఉపయోగించుకోవడం ఖాయమనే చెప్పాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.