• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • ANASUYA BHARADWAJ FIRES ON HYPER AADI DUE TO JABARDASTH COMEDY SHOW SKIT HERE ARE THE DETAILS TA

Anasuya-Hyper Aadi: అనసూయపై ఆ విధంగా ప్రతీకారం తీర్చుకున్న హైపర్ ఆది.. రోజా చూస్తుండగానే..

హైపర్ ఆది అనసూయ (hyper aadi anasuya bharadwaj)

Anasuya Bharadwaj- Hyper Aadi | జబర్ధస్త్ కామెడీ షో అంటేనే రోజా జడ్జ్‌గా ఉండాల్సిందే. అనసూయ యాంకర్‌గా మెరవాల్సిందే. తాజాగా ఈ షోలో అనసూయపై హైపర్ ఆది వేసిన పంచ్‌లు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

  • Share this:
    Anasuya Bharadwaj- Hyper Aadi | జబర్ధస్త్ కామెడీ షో అంటేనే రోజా జడ్జ్‌గా ఉండాల్సిందే. అనసూయ యాంకర్‌గా మెరవాల్సిందే. ఈ షోలో ఎంతో మంది కమెడియన్స్ వాళ్ల స్కిట్స్‌తో ప్రేక్షకులను మైమరింపించినా.. హైపర్ ఆది స్కిట్ లేకపోతే.. అదో వెలతిగా ఉంటుంది. జబర్ధస్త్ కామెడీ షోలో.. చాలా మంది ఉంటారు కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్. యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు.. ఇక హైపర్ ఆది ఆమెపై పంచుల మీద పంచులేస్తుంటాడు. అలాగే అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు. తాజాగా ఈ ఆ పంచ్ లలో రొమాంటిక్ డోస్ పెరిగుతూ వస్తోంది. ఆ మధ్య  ఆదిని అనసూయ బావా అంటూ వయ్యారంగా పిలవడం ఇంకా జబర్దస్త్ ప్రేక్షకుల మదిని దాటి పోలేదు. హైపర్ ఆది స్కిట్‌లో అనసూయపై పంచ్‌లు వేయడం ఆమె కోప్పడటం వంటివి ఆడియన్స్‌కు ఎపుడు బోర్ కొట్టించవు. తాజాగా రాబోయే ఎపిసోడ్‌లో హైపర్ ఆది ప్రేమనగర్‌లో ఎవరి కోసం అంటూ చేసిన స్కిట్‌లో భాగంగా ప్రేమనగర్ సినిమాలోని ఎవరి కోసం అంటూ సాంగ్‌తో ఎంట్రీ ఇస్తాడు.

    ఈ సాంగ్‌లో హైపర్ ఆది పర్ఫామెన్స్ చూసి అనసూయ.. నీకెమైనా పిచ్చా అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ స్కిట్‌లో హైపర్ ఆది.. అనసూయను ఉద్దేశిస్తే.. ఎక్కడికి అంటే.. నీకు కనిపించకుండా పోవడానికి అన్నపుడు హైపర్ ఆది.. కార్వాన్‌లో కూర్చొని కాజు బిర్యానీ తినడానికా అంటూ వేసిన పంచ్‌లకు జడ్జ్‌లుగా ఉన్న రోజా, మనోలు కూడా పగలపడి నవ్వారు. ఇక హైపర్ ఆది వేసే సెటెర్లను అనసూయ ఎంతో స్పోర్టివ్‌గా తీసుకుంటుంది. మొత్తంగా ఈ ఎసిసోడ్.. అక్టోబర్ 22న ఈటీవీలో ప్రసారం కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: