Anasuya Bharadwaj: అప్పట్లో అనసూయ భరద్వాజ్ ఫేవరేట్ హీరో అతనే..

Anasuya Bharadwaj | తెలుగు టీవీ ప్రేక్షకులకు అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది ఈ భామ. తాజాగా ఆమె తన ఫేవరేట్ హీరో ఎవరనే విషయమై స్పందించింది.

news18-telugu
Updated: April 29, 2020, 1:38 PM IST
Anasuya Bharadwaj: అప్పట్లో అనసూయ భరద్వాజ్ ఫేవరేట్ హీరో అతనే..
అనసూయ (Anasuya Bharadwaj)
  • Share this:
తెలుగు టీవీ ప్రేక్షకులకు అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది ఈ భామ. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. మరీ ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. గత ఏడాది ‘కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ కు ప్రేక్షకులు పెద్ద షాకె ఇచ్చారు. ఇక, ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తుంది. ఆ సంగతి పక్కనపెడితే. తాజాగా లాక్‌డౌన్ సందర్భంగా అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫేవరేట్ హీరో ఎవరనే దానిపై ఆసక్తికర సమాధానమిచ్చింది. అప్పట్లో అనసూయకు యాక్షన్ కింగ్ అర్జున్ అంటే క్రష్ ఉండేదట. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ సినిమాతో అతని అభిమానిగా మారిపోయిందట. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. ఈ సినిమాను హిందీలో చిరంజీవి ‘ది జెంటిల్‌మేన్’గా రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది.
First published: April 29, 2020, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading