Home /News /movies /

ANASUYA BHARADWAJ ENJOYS ITALY TOUR WITH RAVI TEJA IN SETS OF KHILADI MOVIE SETS TA

Anasuya Bharadwaj: ఇటలీలో ఆ హీరోతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోన్న జబర్ధస్త్ భామ అనసూయ..

అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)

అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)

Anasuya Bharadwaj: ఇటలీలో ఆ హీరోతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోన్న జబర్ధస్త్ భామ అనసూయ. దానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.

    Anasuya Bharadwaj: ఇటలీలో ఆ హీరోతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోన్న జబర్ధస్త్ భామ అనసూయ. దానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. ప్రస్తుతం అనసూయ.. జబర్ధస్త్ షో చేస్తూనే మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక జబర్థస్త్ షోలో ప్రతి వారం ఏదో ఒక సూపర్ పాటకు డాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.  అంతేకాదు ఈ షోను  తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక  క్షణం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్.అంతేకాదు ఎప్పటి కపుడు లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. ఇక అనసూయ పాపులారిటీ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. పక్కనున్న భాషలకు పాకింది. ప్రస్తుతం ఈ భామ పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం భీష్మ పర్వంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మరోవైపు మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఈ భామను ఎంపిక చేసినట్టు సమాచారం.

    తాజాగా ఇటలీలో ఓ షూటింగ్ నిమిత్తం వెళ్లింది. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. అక్కడ రవితేజతో దిగిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.


    మరోవైపు అనసూయ.. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’లో కీ రోల్ పోషిస్తోంది. మరోవైపు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Khiladi Movie, Ravi Teja, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు