Home /News /movies /

ANASUYA BHARADWAJ DARJA MOVIE RELEASE DATE FIX SLB

Anasuya Bharadwaj: దర్జాగా వెండితెరపైకి అనసూయ.. అందుకు ముహూర్తం ఫిక్స్

Photo Twitter

Photo Twitter

Darja Movie Release Date: రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయ కెరీర్ ని టర్న్ చేసింది. దీంతో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటున్న ఈ జబర్దస్త్ బ్యూటీ.. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే దర్జా అనే మూవీ కంప్లీట్ చేసింది అనసూయ.

ఇంకా చదవండి ...
బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది యాంకర్ అనసూయ (Anchor Anasuya). రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె కెరీర్ ని టర్న్ చేసింది. దీంతో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటున్న ఈ జబర్దస్త్ బ్యూటీ.. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే దర్జా (Darja) అనే మూవీ కంప్లీట్ చేసింది అనసూయ. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు.

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్.. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి వరుస అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన దర్జా టీజర్, ట్రైలర్, పోస్టర్స్ తో పాటు ఇతర అప్ డేట్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచేశాయి. ఈ సినిమాలో అనసూయ ఛాలెంజింగ్ రోల్ చేస్తుందని తెలుస్తుండటం ప్రేక్షకుల్లో ఆత్రుత పెంచేసింది.

చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్ర విడుదలకు సంబంధించిన డేట్ అనౌన్స్‌మెంట్ లోగోని విడుదల చేసిన దర్శకులు వీరశంకర్‌గారికి, మీడియా సోదరులు ప్రభు, వినాయకరావులకు మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి పెద్దలు ఎందరో.. వారి సపోర్ట్‌ని అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాము. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాము. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’’ అని తెలిపారు.

ఈ మూవీలో సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Anasuya, Tollywood, Tollywood actress

తదుపరి వార్తలు