Home /News /movies /

ANASUYA BHARADWAJ DANCE ON MEGASTAR CHIRANJEEVI SONG GEOS VIRAL ON SOCIAL MEDIA HERE ARE THE DETAILS TA

Anasuya Bharadwaj: చిరంజీవి పాటకు ఓ రేంజ్‌లో చిందులేసిన అనసూయ.. సోషల్ మీడియాలో వైరల్..

చిరు పాటకు అనసూయ చిందులు (Instagram/Photos)

చిరు పాటకు అనసూయ చిందులు (Instagram/Photos)

Anasuya Bharadwaj - Chiranjeevi: చిరంజీవి పాటకు ఓ రేంజ్‌లో చిందేలిసేసిన అనసూయ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి వారం గురువారం ప్రసారమయ్యే జబర్ధస్త్ ఎపిపోడ్‌లో యాంకర్ అనసూయ ఏదో ఒక పాటకు చిందేస్తూ జబర్ధస్త్ కామెడీ షోను స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వారం చిరు పాటకు అనసూయ వేసిన స్టెప్పలు సోసల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
    Anasuya Bharadwaj: చిరంజీవి పాటకు ఓ రేంజ్‌లో చిందేలిసేసిన అనసూయ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి వారం గురువారం ప్రసారమయ్యే జబర్ధస్త్ ఎపిపోడ్‌లో యాంకర్ అనసూయ ఏదో ఒక పాటకు చిందేస్తూ జబర్ధస్త్ కామెడీ షోను స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అనసూయ విషయానికొస్తే.. తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్.

    తాాజాగా ఈ భామ.. ఈ వారం మెగాస్టార్ చిరంజీవి, రాధ హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లంకేశ్వరుడు’ సినిమాలోని జివ్వుమని కొండగాలి పాటకు అనసూయ ఓ రేంజ్‌లో చిందులు వేసింది. రాజ్ కోటి స్వరకల్పనలో జబర్ధస్త్ జడ్జ్ మనో (నాగూర్ బాబు), జానకి పాటకు ఓ రేంజ్‌లో చిందులు వేసింది. దాసరి నారాయణరావు 100వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ సంగతి పక్కన పెడితే..  ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడా పాటకు అనసూయ వేసిన చిందులు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈమె మెగాస్టార్ హీరోగా నటిస్తోన్ న‘ఆచార్య’లో కీ రోల్ పోషిస్తోంది.



    అది అలా ఉంటే అనసూయకు తెలుగులో కాకుండా పరభాషాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం భీష్మ పర్వంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మరోవైపు అనసూయ ఐటెం సాంగ్ చేసిన ‘చావు కబురు చల్లగా’ ఈ రోజే విడులైంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anasuya Bharadwaj, Chiranjeevi, Jabardasth comedy show, Tollywood

    తదుపరి వార్తలు