జర్నలిస్ట్ మృతిపై అనసూయ భరద్వాజ్ భావోద్వేగం..

యాంకర్ అనసూయ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. తాజాగా ఈమె యువ జర్నలిస్ట్ మృతిపై ఆవేదన వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: June 8, 2020, 5:38 PM IST
జర్నలిస్ట్ మృతిపై అనసూయ భరద్వాజ్ భావోద్వేగం..
'గుంపులో గోవిందా' అన్నట్టు ఆ పాట చెయ్యడం వల్ల తనకు కలిసొచ్చేది ఏమీ లేదు అనేది తన ఉద్దేశమని.. కానీ తన ఉద్దేశం అర్దం చేసుకోకుండా పవన్ ఫ్యాన్స్ తనను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారని గుర్తు చేసుకుంది.
  • Share this:
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. ఇఫ్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్‌లో కూడా దూసుకుపోతూ వరస సంచలనాలు చేస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. న్యూ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తుంది అనసూయ. ఎపుడు సినిమాలే కావు.. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా కేరళలో ఏనుగు మృతిపై స్పందించిన అనసూయ భరద్వాజ్.. తాజాగా కరోనా కారణంగా కన్నుమూసిన యువ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతిపై ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా పై పోరాటంలో డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా పై పోరాటంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. వార్తలను చేరవేస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా పై పోరాటంలో మనోజ్ అనే యువ జర్నలిస్టు మృతి తనకు బాగా కలిచివేసిందన్నారు అనసూయ. అంతేకాదు ఎంతో మంది జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా కరోనాపై పోరాడుతున్నారు. మీరందరూ కూడా కరోనా పై పోరాటంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

Published by: Kiran Kumar Thanjavur
First published: June 8, 2020, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading