ఏంటి అప్పుడే అనసూయ భరద్వాజ్ పెళ్ళై పదేళ్లవుతుందా..? నిజమా.. అనే అనుమానాలు వస్తున్నాయి కదా. నిజంగానే 10 ఏళ్ల వివాహ బంధం పూర్తి చేసుకుంది అనసూయ. 19 ఏళ్ల ప్రేమ.. 10 ఏళ్ల పెళ్లి బంధాన్ని పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసూయ. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం ఈమె. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. ప్లానింగ్ సరిగ్గా ఉంటే సినిమాల్లో కూడా విజయం మీ వెంటే వస్తుందని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
19 Years of Love ❤️ Happy 10th Wedding anniversary @SusankSusank Garu @anusuyakhasba ❤️😇 Hope you celebrate many more years ❤️😇🙏🏻 #HappyWeddingAnniversary #AnasuyaSusank 👫🏻 #10YearsOfLove pic.twitter.com/5eG8qkesme
— Anasuya Bharadwaj (@Anasuyakhasba) June 4, 2020
ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు.. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా కష్టాలు పడింది ఈమె. మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో అయితే అనసూయ చాలా కష్టాలు పడింది. ఈమె ప్రేమకథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనసూయ ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్నపుడు ఓ సారి NCC క్యాంప్‌కి వెళ్లింది.. ఆ క్యాంప్‌కి తానే గ్రూప్ కమాండర్ కావడంతో.. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారికి శిక్షలు కూడా వేసేదాన్నని చెబుతుంది అను. ఈ క్రమంలో అదే క్యాంప్‌కి వచ్చిన మరో స్టూడెంట్ భరద్వాజ్.. ఈమెని చూసి తన మనసు పారేసుకున్నాడని.. అనుకున్నదే తడవుగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన మనసులో ఉన్న మాటని అనసూయకు చెప్పేసాడట భరద్వాజ్.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 4, 2020
ప్రేమ గీమా కాదు.. ఏకంగా పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు ఈయన. ఆ వయసులో అసలు ప్రేమంటేనే తెలియదంటే.. నేరుగా పెళ్లి అన్నాడేంటని ఆలోచించి అనసూయ కూడా ఆశ్చర్యపోవడమే కాదు.. భరద్వాజ్ ధైర్యానికి పడిపోయింది. కానీ అప్పుడేం చెప్పకుండానే క్యాంప్ నుంచి వచ్చేయడం.. ఆ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకోవడం.. మళ్లీ సరిగ్గా ఏడాదిన్నర తర్వాత మళ్లీ వాళ్లిద్దరూ క్యాంప్‌లో కలిసి మాట్లాడుకొనే సమయానికి.. అనసూయకు భరద్వాజ్‌కు కూడా భరద్వాజ్‌పై మంచి అభిప్రాయం కలిగిందట. అలా తమ స్నేహం మొదలైందని చెప్పింది అనసూయ.
నెమ్మదిగా ఆమెకు అతనిపై ఇష్టం.. ప్రేమ మొదలయ్యాయని.. కానీ ఇక ఈ విషయం అప్పటికి కేవలం తన తల్లికి మాత్రమే చెప్పిందట అనసూయ. కానీ అనసూయకి ఇద్దరు చెల్లెలు ఉండడంతో.. ఆమెకు మంచి సంబంధం చూసి చేస్తే... మిగిలిన వాళ్లకు కూడా మంచి సంబంధాలు వస్తాయని అనుకునేవారట అనసూయ తండ్రి. కానీ భరద్వాజ్‌తో అనసూయ ప్రేమ మొదలైన మూడేళ్ళ తర్వాత వాళ్ల ఇంట్లో కూడా మరో సంబంధం తీసుకొచ్చాడు వాళ్ల నాన్న.. ఆ తర్వాత రోజుకో సంబంధం వచ్చేదట.. దాంతో తన ప్రేమ విషయం చెప్పేసరికి.. ఇంట్లో నాన్నతో చాలా గొడవలు జరిగాయని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది అనసూయ.
ఆ తర్వాత ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసి... కొన్నాళ్లు హాస్టల్‌లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి రానిచ్చినా కూడా భరద్వాజ్‌తో పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదు వాళ్ల నాన్న. ఈ క్రమంలోనే మీరు నాకు నచ్చిన భరద్వాజ్‌తో పెళ్లి చేసే వరకు నేను ఎక్కడికీ వెళ్ళనంటూ అనసూయ మొండి పట్టుదలతో చెప్పేయడంతో ఇంట్లో వాళ్లు కూడా ఏమీ అనలేక పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే అనసూయకు మాత్రం వాళ్ల నాన్నతో మాటలు కట్ అయ్యాయి. ఆయనకు నచ్చడానికి.. ఈ పెళ్లి ఒప్పుకోడానికి కొన్నాళ్లు సమయం తీసుకున్నాడు. భరద్వాజ్ అనసూయకి ప్రపోజ్ చేసిన 9 ఏళ్ళ తర్వాత కానీ వీళ్ల పెళ్లి జరగలేదు.
ఈ 9 ఏళ్ల కాలంలో అప్పుడప్పుడు ఓపిక నశించి.. మనం బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందామని భరద్వాజ్‌తో చెప్పినా కూడా పెద్దల అంగీకారంతోనే పెళ్లి జరగాలని సర్ది చెప్పేవాడట భరద్వాజ్. చివరికి రెండు కుటుంబాల అంగీకారంతో 2010 జూన్ 6 అనసూయ కాస్తా అనసూయ భరద్వాజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు పిల్లలు. మొత్తానికి పదేళ్ల కాపురంలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని చెబుతుంది అనసూయ భరద్వాజ్. ఏదేమైనా ప్రేమించిన వాడి కోసం ఏకంగా 9 ఏళ్లు పోరాటం చేసింది అనసూయ. మొత్తానికి తనతో 19 ఏళ్ల బంధం ఉందని చెబుతుంది ఈ జబర్దస్త్ యాంకర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood