జబర్దస్త్ బ్యూటీగా మస్త్ పాపులర్ అయిన యాంకర్ అనసూయ (Anasuya).. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అరి (Ari) అనే సినిమాతో రెడీ అయింది అనసూయ. పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన జయ శంకర్ (Jayashankarr) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ అరి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు. రెండు నిమిషాల 3 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో అనసూయకు సంబంధించిన సన్నివేశాలు మేజర్ హైలైట్ అయ్యాయి. అరి టైటిల్‌తోనే ప్రేక్షకుల చూపు ఈ సినిమాపై పడేలా చేసిన డైరెక్టర్ జయ శంకర్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి జనాల్లో అంచనాలు నెలకొల్పారు.
ట్రైలర్ చూస్తుంటే అరిషడ్వర్గాలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరిగే కథతో ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తెరకెక్కించారని స్పష్టమవుతోంది. మనిషి ఎలా బతకకూడదు అనే కోణాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపిస్తూ థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది.
ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ 'అరి' సినిమాలో అనసూయ , సాయికుమార్, శ్రీకాంత్ అయ్యర్, సుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుమన్, ఆమని, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐడ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ ఇతర పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Anchor anasuya