Home /News /movies /

ANANYA PANDAY WILL BE SEEN IN A SPECIAL SONG FOR ALLU ARJUN PUSHPA SR

Allu Arjun Pushpa : అల్లు అర్జున్‌తో చిందేయనున్న విజయ్ దేవరకొండ భామ..

అల్లు అర్జున్ (Allu Arjun/Twitter)

అల్లు అర్జున్ (Allu Arjun/Twitter)

Allu Arjun : సుకుమార్ సినిమాల్లో మామూలుగా ఐటమ్ సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అంతేకాదు ఈ కథ అడవి నేపథ్యంలో సాగేది కావడంతో, ఆ స్థాయిలోనే ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సుకుమార్.

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుంని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అధికారకంగా ప్రకటించింది చిత్రబృందం. అందులో భాగంగా తెలుగుతో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ పోయిన సంక్రాంతికి అల వైకుంఠపురంలోతో వచ్చి భారీ కమర్షియల్ హిట్ ని సాధించాడు. ఈ సినిమాతో తన సత్తా ఏమిటో నిరూపించాడు బన్ని. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని భారీగా పెంచేసింది. ఆ సినిమా తర్వాత బన్ని కొంత గ్యాప్ ఇచ్చి.. పుష్పను చేస్తున్నాడు.. బన్ని. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రం ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుంది.

  అడవి నేపథ్యంలో సాగుతుండడంతో ఈ సినిమాను చాలా వరకు కేరళ అడవుల్లో చిత్రీకరించాలనీ భావించారు దర్శక నిర్మాతలు. కానీ కరోనాతో ఆ ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి. దీంతో ఆదిలాబాద్, వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించాలనీ భావిస్తోందట చిత్రబృందం. ఇక ఈ సినిమా కూడా సుకుమార్ సక్సెస్ మంత్ర అయినా... రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఇక ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ 20 నుండి స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారని.. అయితే ఈ సెట్స్ కేవలం సాంగ్స్ కోసమేనని.. నవంబర్ లో ఈ సెట్స్ లోనే బన్నీ, రష్మిక పై రెండు సాంగ్స్ ను తీయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ కోసం బాలీవుడ్‌ హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంకా ఎవరు సెట్ కాలేదు. సుకుమార్ సినిమాల్లో మామూలుగా ఐటమ్ సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అంతేకాదు ఈ కథ అడవి నేపథ్యంలో సాగేది కావడంతో, ఆ స్థాయిలోనే ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సుకుమార్. అయితే ఈ సాంగ్ కోసం చరణ్ సరసన నటించిన కైరా అద్వానీని తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ కుదరలేదు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని సంప్రదించారని వార్తలు వచ్చాయి అయితే అదీ వర్క్ అవుట్ కాలేదట. దాంతో యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఫైనల్ చేసే ప్లాన్ లో ఉందట చిత్రబృందం. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది.

  కాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది. అది ఏమంటే.. సాయిపల్లవి పుష్ప చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబందించి ఇటీవలే దర్శకుడు సుకుమార్ ఆమెకు తన పాత్ర గురించి వివరించాడని.. నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషమేమంటే.. సాయి పల్లవి ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటిస్తోందిని సమాచారం. దీనిపై కొంత స్పష్టత రావాల్సిఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాను మెత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రీసెంట్ గా అల్లు అర్జున్.. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 21వ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న ఆచార్యను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే అల్లు అర్జున్ సినిమా ఉండనుందట.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Allu Arjun, Sukumar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు